Take a fresh look at your lifestyle.

రెక్కాడితే.. డొక్కాడని నిరుపేదలకు.. కూరగాయలు, నిత్యావసర సరుకుల కిట్స్ ‌పంపిణీ చేసిన మంత్రి హరీష్‌రావు

లాక్‌ ‌డౌన్‌ ‌నేపథ్యంలో నిరు పేదలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ ‌రావు అండగా నిలుస్తున్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మంత్రి నివాసంలో శనివారం మధ్యాహ్నం నియోజకవర్గ పరిధిలోని 237 మంది నిరుపేద కుటుంబాలకు మంత్రి చేతుల మీదుగా నిత్యావసర వస్తువుల కిట్స్ ‌పంపిణీ చేశారు. వీరిలో ఇబ్రహీంనగర్‌ ‌హోలియా దాసరి – 55 మంది, రామంచ లోని దాసరోళ్లు-65 మంది, నాంచారుపల్లి గంగిరెద్దులోళ్లు- 25 మంది, రాఘవపూర్‌-14, ‌చందలాపూర్‌-11, ‌రాంచంద్రానగర్‌-9, ‌మందపల్లి- 58 మంది పిట్టలోల్లకు మొత్తం 237 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్స్ ‌పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లాక్‌ ‌డౌన్‌ ‌పూర్తయ్యే వరకు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

కొరోనా కట్టడికై విరాళాలు ఇవ్వండి..
కరోనాను కట్టడి చేయడానికి ఎవరికి తోచిన విధంగా వారు సాయం చేస్తూనే ఉన్నారు. రాజకీయ ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, ట్రస్టులు, సామాజిక కార్యకర్తలు తమవంతు బాధ్యతగా సాయాన్ని ప్రకటిస్తున్నాయి. ఇదే బాటలో మరింత మంది ముందుకు రావాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ ‌రావు పిలుపునిచ్చారు.

 సిద్ధిపేట ఫోటోగ్రాఫర్స్ ‌తరపున రూ.11వేల విరాళం ..
సిద్ధిపేట ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్‌ ‌తరపున రూ.11వేల రూపాయల విరాళాన్ని సీఏంఆర్‌ఎఫ్‌ ‌కు ఇవ్వాలని మంత్రి హరీశ్‌ ‌రావుకు ఫోటో గ్రాఫర్స్ ‌సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకన్న, జిమ్మి శేఖర్‌, ‌పురుషోత్తం, ప్రభుదాస్‌, ‌కృష్ణ, గణేష్‌, ‌కృష్ణ, శరత్‌ ‌తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు దూది మల్లారెడ్డి ఫంక్షన్‌ ‌హాల్‌ ‌లో మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌రాజనర్సు సమక్షంలో 140 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్స్ ‌పంపిణీ చేపట్టారు.

పోలీసులకు మాస్కులు, శానిటైజర్స్ ‌పంపిణీ
సిద్ధిపేటకు చెందిన నక్షత్ర గ్రూపు ప్రయివేట్‌ ‌లిమిటెడ్‌ ‌కంపనీ, ప్రముఖ పారిశ్రామిక వేత్త కే. సుధాకర్‌ ‌రావు ఆధ్వర్యంలో 100 శానిటైజర్లను, మాస్కులను మంత్రి చేతుల మీదుగా సిద్ధిపేట ఏసీపీ రామేశ్వర్‌, ‌వన్‌ ‌టౌన్‌ ‌సీఐ సైదులుకు మంత్రి అందించారు. కరోనా నేపథ్యంలో నిరుపేదల సంక్షేమానికి, పోలీసు, వైద్య, పారిశుద్ధ్య కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారని వారి సేవలను మంత్రి కొనియాడారు. నిరుపేదలకు, పోలీసు, వైద్య, శానిటేషన్‌ ‌సిబ్బందికి బాసటగా నిలిచేలా మరింత మంది దాతలు ముందుకు రావాలని మంత్రి హరీశ్‌ ‌పిలుపునిచ్చారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy