ఈ నెలాఖరులోపు మెడికల్ కళాశాల భవనం, ప్రిన్సిపల్ క్వార్టర్స్ పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు వైద్య ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సిద్ధిపేట మెడికల్ కళాశాల హాల్ లో గురువారం ఉదయం ప్రిన్సిపల్ తమిళ్ అరసు, సూపరింటెండెంట్ చంద్రయ్య, వైద్య ఇంజినీరింగ్ అధికారులు విష్ణు ప్రసాద్, సిబ్బందితో సమీక్షించారు. మెడికల్ కళాశాలలోని భవనాల్లో డ్రైనేజీ సమస్య ఉండొద్దని, సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులతో పాటు తాగునీటి, డ్రైనేజీ సమస్యలు రాకుండా అసంపూర్తి పనులన్నీ వెంటనే పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రధానంగా సిటీ స్కాన్, ఐసీయూలో 20 బెడ్స్ వెంటనే తెప్పించాలని సూచించారు. వచ్చే 15 రోజుల్లో డయాగ్నోస్టిక్ కేంద్రం మెడికల్ కళాశాలలో ఏర్పాటు కావాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కళాశాల ఆవరణ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. అనేకమంది రోగులు వచ్చే క్రమంలో చెప్పుల స్టాండ్ ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు. ఈ సమీక్షలో వైద్య అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సిద్ధిపేట: జిల్లా కేంద్రమైన సిద్ధిపేట విపంచి ఆడిటోరియంలో చిన్నకోడూర్ మండలంలోని గ్రామాల వారీగా అభివృద్ధి నిర్మాణ పనుల పురోగతి పై మంత్రి హరీశ్ రావు సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, డీఆర్డీఏ పీడీ గోపాల్ రావు, డీపీఓ సురేశ్ బాబు, జెడ్పీ సీఈఓ శ్రవణ్, ఏంపీపీ మాణిక్ రెడ్డి, మండలంలోని జెడ్పీటీసీ, సర్పంచ్ లు, ఏంపీటీసీలు, ఏంపీడీఓ, తహశీల్దార్, పంచాయతీ రాజ్ శాఖ, ఏఈఓలు, పంచాయతీ కార్యదర్శిలు, వివిధ శాఖ అధికారులు ఉన్నారు.