Take a fresh look at your lifestyle.

రైతులను కారెక్కించే పార్టీ కావాల్నా..

  • రైతులపైకి కారెక్కించే పార్టీ కావాల్నా?
  • గెల్లు గెలిస్తే…….. రైతుల రుణం వడ్డీతో సహా మాఫీ
  • 57 ఏళ్లకు పెన్షన్‌. 5 ‌వేల ఇళ్లు పూర్తి
  • స్వంత జాగా ఉన్న వారికి రూ. 5 లక్షలు
  • ఈటల గెలిస్తే…డిజిల్‌ ‌రూ.150, పెట్రోల్‌ ‌రూ. 200
  • వొచ్చే నెల 2 తర్వాత గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌రూ.1200
  • మీకు…గెల్లు గెలిస్తే లాభమా…? ఈటల గెలిస్తే లాభమా..? ఆలోచించి వోటేయండి
  • హుజూరాబాద్‌ ‌ప్రచారంలో మంత్రి హరీష్‌ ‌రావు

రైతులను కారెక్కించే టీఆర్‌ఎస్‌ ‌పార్టీ కావాల్నా..? రైతులపైకి కారెక్కించే బీజేపీ కావాల్నా?.. మీరే తేల్చుకోండని హుజూరాబాద్‌ ‌హుజూరాబాద్‌ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్‌రావు వోటర్లను ప్రశ్నించారు. జమ్మికుంట మండలంలోని మాచాన్‌పల్లి గ్రామంలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ..బీజేపీకి వోటేస్తే ఏం ప్రయోజనం కలుగుతుందో హుజూరాబాద్‌ ‌ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. బీజేపీ మీటింగ్‌ అం‌టేనే నాలుగు తిట్లు.. నలుగురిని రెచ్చగొట్టడం..నాలుగు వోట్లు సంపాయించడమని విమర్శించారు. ఈటల రాజేందర్‌ ‌తన స్వార్థంకోసమే రాజీనామా చేశాడని, జమ్మికుంటకు మెడికల్‌ ‌కాలేజీ కావాలని, హుజూరాబాద్‌ ‌జిల్లా కావాలనే డిమాండ్‌తో రాజీనామా చేయలేదని హరీష్‌ ‌రావు అన్నారు. ఈటల హైదరాబాద్‌లో మెడికల్‌ ‌కాలేజీ పెద్దగా కట్టుకున్నాడని, మరి ఇక్కడ ప్రజలపై ప్రేమ ఉంటే జమ్మికుంటలోనే ఆ కాలేజీ కట్టొచ్చు కదా? అని ప్రశ్నించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక రెండేళ్ల కాలానికి మాత్రమేనని, ఆ కాలంలో రాష్ట్రంలో అధికారంలో ఉండేది టీఆర్‌ఎస్‌ ‌పార్టీయేనని అన్నారు.

Minister Harish Speech In Huzurabad campaign

సీఎం కేసీఆర్‌ ‌మాట ఇస్తే తప్పరని, టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే రూ. 200 పింఛన్‌ను వెయ్యి రూపాయలు చేస్తా అని సీఎం కేసీఆర్‌ ‌హామీ ఇచ్చారని, గెలువంగనే చేసి చూపించారన్నారు. మళ్లీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే వెయ్యి రూపాయల పింఛన్‌ను రూ. 2016కు పెంచుతానని చెప్పారని, ఆ విధంగానే పెంచి నెలనెలా ఇస్తున్నారని తెలిపారు. రైతులకు ఎకరాకు ఇస్తున్న రూ. నాలుగు వేల రైతుబంధును రూ. 5 వేలు చేస్తా అని చెప్పి.. చేసిండా? లేదా? అని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి కింద మొదట రూ. 50వేలు ఎస్సీలకే ఇచ్చారని, ఆ తర్వాత తమను గెలిపిస్తే రూ. లక్షా నూట పదహార్లు అందరికీ ఇస్తా అని కేసీఆర్‌ ‌హామీ ఇచ్చారని, అన్నట్లుగానే చేసి చూపించారని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. కేసీఆర్‌ ‌కిట్‌ ఇచ్చి పేదింటి ఆడబిడ్డకు ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా కాన్పు చేయడంలేదా? అని ప్రశ్నించారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన పార్టీ దేశంలో ఏదైనా ఉందా? అని అడిగారు. మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామని, ఆ నీటితో రైతులు యాసంగిలో కూడా పంట పండిస్తున్నారని హరీష్‌ ‌రావు అన్నారు.

ఈటల రాజేందర్‌ ‌చేరిన పార్టీ బీజేపీ అని, ఆ పార్టీ బాయిల కాడ మీటర్లు పెడతామని చెబుతున్నదని హరీష్‌ ‌రావు పేర్కొన్నారు. ఆంధ్రా సీఎం ఇప్పటికే మీటర్లు పెట్టడం ప్రారంభించాడని, కానీ తన ప్రాణం పోయినా బాయికాడ మోటార్లకు మీటర్లు పెట్టనినయ్యనని సీఎం కేసీఆర్‌ అం‌టున్నారని తెలిపారు. బాయికాడ మీటర్లు పెడ్తామని ఈటల పార్టీ అంటున్నదని, కానీ ఉచిత కరెంటు ఇస్తున్నది గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ ‌పార్టీ అని అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలతో అన్నదాత ఉసురుపోసుకుంటున్న బీజేపీలో ఈటల చేరాడని, ఆయనకు వోటుతోనే తగిన బుద్ధి చెప్పాలని మంత్రి హరీష్‌ ‌రావు ప్రజలను కోరారు. కారు గుర్తుకు వోటేసి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపిస్తే హుజూరాబాద్‌ అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ప్రచారంలో మంత్రి హరీష్‌ ‌రావుతో పాటు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జడ్పీటీసీ శ్యామ్‌, ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply