Take a fresh look at your lifestyle.

మంత్రి హరీష్ రావు నల్లగొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ

నల్లగొండ ,జూలై 26: నల్లగొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు మంగళ వారం  ఆకస్మికంగా సందర్శించారు. మెడికల్ కాలేజ్, హాస్పిటల్ ను సందర్శించి వైద్యులు సిబ్బందితో మంత్రి సమీక్షించారు. వైద్యుల పనితీరు పై ఆరా తీశారు. సిబ్బంది టైం రిజిస్టర్ తనిఖీ చేశారు. అన్ అథారైజ్డ్ అటెండెన్స్  ఉన్న  వైద్యులకు, సిబ్బందికి నోటీసులు ఇవ్వాల్సిందిగా సూపరింటెండెంట్ ను   ఆదేశించారు. నూతన మెడికల్ కాలేజ్ భవన నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ని ఆదేశించారు, మరింత మెరుగైన వైద్య సేవలు  అందించాలంటే నూతన మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నిర్మాణం అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి  ఆలోచనకు అనుకూలంగా ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని మంత్రి తెలిపారు.సమీక్ష అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ  “హాస్పిటల్ లో  ఎంతమంది డాక్టర్లు పనిచేస్తున్నారు..
ఈ రోజు ఎంత మంది హాజరయ్యారు..ఎంతమంది రాలేదు అనే విషయాలు పరిశీలించా….అని తెలుపుతూ  కొత్త కాలేజీ, హాస్పిటల్  నిర్మాణం గురించి డాక్టర్లు నా దృష్టికి తీసుకువచ్చారు.. నల్లగొండ జిల్లా కేంద్రంలో కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు రేపటి నుండే ప్రారంభించాలని కలెక్టర్ ను ఆదేశించాం..హాస్పిటల్ లో  అక్కడక్కడ ఉన్న లోపాలను గుర్తించాము..వాటన్నిటిని అధిగమించి పేదలకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించాను. అని మంత్రి హరీష్ రావు తెలిపారు.. కొంతమంది డాక్టర్లు ఏలాంటి సమాచారం లేకుండా గైర్ హాజరు హాజరవుతున్నారు అని పేర్కొంటూ .. కొంతమంది మధ్యాహ్నం వెళ్ళిపోతున్నారు.. కొంతమంది విధులు సక్రమంగా నిర్వర్తించకుండానే వెళ్ళిపోతున్నట్లు సమాచారం ఉందన్నారు.ప్రతి ఒక్కరు వారికి నిర్దేశించిన పనివేళల్లో  విధులు నిర్వర్తించాలి..కొత్త డైట్ పాలసీ వచ్చింది కాబట్టి పేషెంట్లకు హాస్పిటల్స్ ల్లో  నాణ్యమైన భోజనం అందించాలి..గైనిక్ డిపార్ట్మెంటులో 500లోపే ప్రసవాలు జరుగుతున్నాయి. వాటిని 700 వరకు పెంచాలి..అని అన్నారు.
హైదరాబాద్ కు రిఫరల్ తగ్గించి.. వీలైనంతవరకు ఇక్కడే వైద్య సేవలు అందించాలి..అత్యవసరమైతే తప్ప హైదరాబాద్ కి రిఫర్ చేయొద్దు.. ఆర్థోపెడిక్ విభాగం కూడా మరిన్ని కీలక వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటాం..సాయంత్రం వేళల్లో కూడా ఓపి చూడాలని అడిగితే సానుకూలంగా స్పందించిన వైద్యులకు ధన్యవాదాలు..కెసిఆర్ ఆదేశాల మేరకు అన్ని రకాల వైద్య సేవలు ప్రభుత్వ దవాఖానాలో   నే చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.. ముఖ్యమంత్రి చొరవ వల్లే ఒక్క జిల్లాలో రెండు మెడికల్ కళాశాలలో వచ్చాయి.. సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి… మెడికల్ డైరెక్టర్ రమేష్ త్వరలో జిల్లా కేంద్ర హాస్పిటల్ కి  వచ్చి పరిశీలిస్తారు..మెడికల్ విద్యార్థుల కాలేజీ, హాస్టల్, లైబ్రరీ, సమస్యల పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు..త్వరలో వారి సమస్యలను పరిష్కరిస్తాం..అని మంత్రి హరీష్ రావు తెలిపారు.

Leave a Reply