Take a fresh look at your lifestyle.

నెరవేరిన మంత్రి హరీష్‌రావు హామీలు

  • చేర్యాలలో ఇరిగేషన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ‌కార్యాలయాల పునరుద్ధరణ
  • చేర్యాలకు ఏడీఏ కార్యాలయం మంజూరు
  • ఉత్తర్వులు జారీ చేసిన ఆ శాఖ కమిషనర్‌
  • ‌వారం రోజుల్లో ఏడీఏ కార్యాలయం ఏర్పాటుకు అధికారుల కసరత్తు

హామీలు ఇవ్వటమే కాదు…ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  తన్నీరు హరీష్‌ ‌రావు ఎప్పుడూ ముందుంటారు. ఆ విషయం మరోసారి నిరూపితమైంది. వివరాల్లోకి వెళ్లితే…ఈ ఏడాది ఆగస్టు నెలలో చేర్యాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంత్రి హరీష్‌రావు పర్యటించిన సందర్భంగా జనగామ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చేర్యాల మునిసిపాలిటీ, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, ధూళిమిట్ట మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై స్థానిక ఎమ్మెల్యే  ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి సమీక్షా  సమావేశ నిర్వహించారు.

స్థానిక ఎమ్మెల్యే  ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేర్యాలలో  ఇరిగేషన్‌, ‌గ్రామీణ తాగునీటి సరఫరా సబ్‌ ‌డివిజన్‌ ‌కార్యాలయాలు, వ్యవసాయ సహాయ సంచాలకుల (ఏడీఏ) కార్యాలయాల ఏర్పాటు ఆవశ్యకతను  చేర్యాలకు వచ్చిన మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి సమీక్షా సమావేశంలోనే ఏర్పాటుకు హామీ ఇచ్చారు. రెండు రోజుల్లో చేర్యాల కేంద్రంగా  ఆర్‌డబ్ల్యూఎస్‌ ఉప కార్య నిర్వాహక ఇంజనీరు కార్యాలయంతో పాటు చేర్యాలలో ఇరిగేషన్‌ ‌సబ్‌ ‌డివిజన్‌ ఆఫీస్‌ను యధావిధిగా తీసుకువస్తామని పేర్కొన్నారు.

అవసరమైన నివేదికలు ప్రభుత్వానికి పంపాలని అక్కడి నుంచే సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే చేర్యాల మునిసిపాలిటీలో సిసి  రోడ్ల నిర్మాణంకు కోటి రూపాయలు మంజూరు చేస్తామని స్పష్టం చేసారు. ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే చేర్యాలలో రద్దు చేసిన నీటి పారుదల, గ్రామీణ తాగునీటి సరఫరా సబ్‌ ‌డివిజన్‌ ‌కార్యాలయాలను ఇటీవలే పునరుద్ధరించారు. స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ రెండు కార్యాలయాలు ప్రారంభమై ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. చేర్యాల మునిసిపాలిటీలో సిసి రోడ్ల నిర్మాణంకు కోటి రూపాయలు మంజూరు  చేశారు.

వారం రోజుల్లో ఏడీఏ కార్యాలయం ఏర్పాటుకు అధికారుల కసరత్తు…
ఇటీవలే  చేర్యాలలో వ్యవసాయ సహాయ సంచాలకుల (ఏడీఏ) కార్యాలయం మంజూరు చేస్తూ వ్యవసాయ శాఖ కమిషనర్‌ ‌మేమో జారీ చేశారు . చేర్యాల మార్కెట్‌ ‌యార్డ్ ‌పరిధిలో సహాయ సంచాలకుల (ఏడీఏ) కార్యాలయంను వారం రోజుల్లో ప్రారంభించేందుకు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. స్వరాష్ట్రం ఏర్పాటయ్యాక సాగునీటి వనరుల లభ్యత జరిగింది. ఫలితంగా కరవు పీడిత ప్రాంతం  చేర్యాల సబ్‌ ‌డివిజన్‌ ‌పరిధిలో చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, దూల్‌మిట్ట మండలాల పరిధిల సాగు విస్తీర్ణం పెరిగింది. విస్తీర్ణం కావడంతో  రైతులకు వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు అవసరమయ్యాయి.  క్షేత్ర వ్యవసాయ అధికారులకు పర్యవేక్షణ, మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉంది.

వ్యవసాయ సహాయ సంచాలకుల పరిపాలన సౌలభ్యం పెరిగి రైతుల కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు వేగంగా అందనున్నాయి.కాగా  జిల్లాలో ఇప్పటికే  సిద్దిపేట, గజ్వేల్‌, ‌హుస్నాబాద్‌, ‌దుబ్బాక, ములుగు వ్యవసాయ డివిజన్లు ఉండగా  చేర్యాలలో  ఏర్పాటయ్యే ఏడిఏ కార్యాలయంతో ఆ  సంఖ్య ఆరుకు చేరనుంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా నుంచి సిద్దిపేట జిల్లాలో చేరిన చేర్యాల ప్రాంత అభివృద్ధికి, ఇరిగేషన్‌, ‌గ్రామీణ తాగునీటి సరఫరా సబ్‌ ‌డివిజన్‌ ‌కార్యాలయాలు, వ్యవసాయ సహాయ సంచాలకుల (ఏడీఏ) కార్యాలయాల ఏర్పాటుకు  మంత్రి హరీష్‌రావు ప్రత్యేక చొరవ చూపడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply