Take a fresh look at your lifestyle.

ఆరెళ్లలో రాం చందర్ రావు ఏం చేసారు..? మంత్రి హరీష్ రావు సూటి ప్రశ్న

  • చంపాపేట్ లోని ఓ ఫంక్షన్ హాలులో అడ్వకేట్ ‌ల ఆత్మీయ సమ్మేళనం.
  • ముఖ్య అతిధిగా హజరయిన మంత్రి హరీశ్ రావు‌

ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..”2104 లో తెలంగాణ సాధించాం…
అంతకు ముందు మూడు రోజులు ఫ్యాక్టరీలకు పవర్ హాలిడే..పరీక్ష లు చదువుదామంటే కరెంటు కోతలు.ఇప్పుడు పరిశ్రమలు , వ్యవసాయం, గృహావసరాలకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం.. తెలంగాణా వచ్చినప్పుడు మన విద్యుత్ ఉత్పతి సామర్థ్యం 6 వేల మెగావాట్లు. ఇప్పుడు మన సామర్థ్యం పదహారు వేల మెగావాట్లు‌..” అని అన్నారు.”70 ఏళ్లలో ఇంటింటికి తాగు నీరు ప్రభుత్వాలు ఇవ్వలేకపోయాయి..తెలంగాణ వచ్చాక ప్రతీ ఇంటికి తాగు నీరు..మహబూబ్‌నగర్ ఓనాడు వలసలు. ఇప్పుడు తిరిగి తమ గ్రామాలకు వస్తున్నారు..బెంగాల్ లో ఎన్నికలవుతున్నాయి. బీహార్ లో ఎన్నికలు అయిపోయాయి..కాని‌ వాళ్ల ఎన్నికల మ్యాన్ ఫెస్ట్ లో తెలంగాణ మాదిరి మిషన్ భగీరథ లా తాగు నీరు , టీఎస్ ఐపాస్ తెస్తామని చెబుతున్నారు…” అని మంత్రి గుర్తు చేసారు.

“ప్రపంచ దేశాలు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాదు కు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు.. పారదర్శకంగా, భద్రత పరంగా హైదరాబాద్ ను ఇష్టపడుతున్నారు..కొరోనా వల్ల‌ 40 వేల‌కోట్లు‌తగ్గాయి. లాక్ డౌన్, పెట్టుబడులు రాకపోవడం వల్ల కావచ్చు..ఇతర రాష్ట్రాల‌తో పోల్చితే తెలంగాణ రాష్ట్రం ఈ రెండు మూడు నెలల్లో గ్రోత్ రేటు బాగుంది..” అని వివరించారు.”మిలియన్ మార్చ్ ఈ రోజు. ఉద్యమంలో అడ్వకేట్ లు సహకరించారు..పోలీసులు కేసులు పెడితే ఉద్యమ కారులను కాపాడారు. బెయిల్ ఇప్పించారు..వంద కోట్లతో అడ్వకేట్ సంక్షేమానికి ప్రభుత్వం కేటాయించింది..కోవిడ్ లో 25 కోట్లతో పదహారు వేల అడ్వకేట్ లను ప్రభుత్వం ఆదుకుంది‌..”అని తెలిపారు.బావోద్వేగాలతో బీజేపీ ప్రభుత్వం లాభపడాలని‌చూస్తోందని..రాష్ట్రం రాగానే ఏడు మండలాలను ఏపీలో‌కలిపింది సీలేరు ప్రాజెక్టు కోల్పోయాం..ఆంధ్రా కు విభజన సమయంలో జాతీయ ప్రాజెక్టు ఇస్తామని హమీ ఇచ్చి నెరవేర్చారు..

- Advertisement -

” అన్నారు.”తెలంగాణా కు గిరిజన యూనివర్సిటీ , బయ్యారం ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అన్నారు. ఏదీ ఇవ్వలేదు. ఐటీఐఆర్ ను రద్దు చేశారు.. గత బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి కోతలు – ప్రజలకు వాతలు..ప్రజలు‌కట్టే పన్నుల్లో 42 ‌శాతం రాష్ట్రాలకు ఇవ్వాలి. తెలంగాణ కు 2.43 శాతం రావాలి. దాన్ని 2.13 కి తగ్గించారు. 14 వేల 150 కోట్లు బడ్జెట్ లో కోత పెట్టారు ‌..13 వ ఫైనాన్స్ కింద హక్కుగా ఇవ్వాల్సిన 1140 కోట్లు ఇవ్వని విషయం వాస్తవం కాదా..14 వ ఫైనాన్స్ కింద రావాల్సిన 817 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టడం వాస్తవం కాదా..”అని
ప్రశ్నించారు.”ఆర్థిక సంఘం కింద రావాల్సిన దాంట్లో 15 వేల కోట్ల కోత విధించారని..Brgf కింద 950 కోట్లు ఇవ్వకుండా ఆపలేదా..మొత్తం మీద కేంద్రం నుంచి రాష్రానికి రావాల్సిన మొత్తంలో ఇరవై వేల కోట్లు రాష్ట్రానికి కోత విధించింది..జీడీపీ పెంచుతామంటూ బీజేపీ ప్రభుత్వం గ్యాస్, డిజిల్, పెట్రోల్ ధరలు తగ్గించింది..బీజేపీ అధికారంలోకి వచ్చే ముందు 300 రూపాయలున్న గ్యాస్ ధర నేడు 900కు పెంచింది. ప్రతీ నెల పెంచుకుంటూ పోతుంది. ఇక ముందు వేయి రూపాయల కావచ్చు..దేశ వృద్ధి రేటు ప్లస్ 8 శాతం నుంచి మైనస్ 8 శాతానికి పడిపోయింది. దేశ స్థూల ఆదాయం తగ్గిపోయింది..

తెలంగాణకు బీజేపీ చేసిందేంటో చెప్పాలి. మొన్నటి బడ్జెట్ లో ఎరువుల రాయితీ లక్ష కోట్లు తగ్గించింది. దీంతో ఎరువుల ధరలు బారీగా పెరిగే అవకాశం ఉంది..”అని మంత్రి ఆందోళన వ్యక్తం చేసారు. “ఇప్పటికే దేశంలో బీఎస్ఎన్ ఎల్, ఎల్. ఐ. సీ, రైల్వేస్, విమాన యాన సంస్థలను కేంద్రం ప్రయివేటు పరం చేస్తోంది.. పక్క రాష్ట్రంలో ఉక్కు ఫ్యాక్టరీని ప్రయివేటు పరం చేస్తోంది.. రేపు మన తెలంగాణలోని బీడీఎల్ లాంటి సంస్థలను ప్రయివేటు పరం చేయనుంది..ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను బీజేపీ ప్రభుత్వం ఊడగొడుతుంది..” అన్నారు. “రైతుల పట్ల అనుకూలంగా ట్వీట్‌ చేస్తే సినిమా యాక్టర్, ఐఎస్‌అధికారులపై కక్ష సాధింపా..రైతుకు అనుకూలంగా మాట్లాడే స్వేచ్ఛ ఈ దేశంలో లేదా.. ఆరేళ్లలో న్యాయవాదులుకు బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు ఏం చేశారు…అని ప్రశ్నిస్తూ..తెరాస అభ్యర్థి వాణీ దేవిని బలపర్చాలి..అని పిలుపునిచ్చారు.

Leave a Reply