Take a fresh look at your lifestyle.

సమాజ వికాసానికి నిజమైన కొలమానం మహిళలే

 అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు…
 రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు .
అంతర్జాతీయ  మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళ సోదరి మణులకు మంత్రి హరీష్ రావు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ..ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక సమాజ వికాసానికి నిజమైన కొలమానం.. ఆ సమాజంలోని మహిళాభివృద్ధి స్థాయి మాత్రమేనని అంబేద్కర్ మహాశయుడు చెప్పారని . ఆయన మాటలు మననం చేసుకుంటు  మహిళల వికాసానికి, భద్రతతకు, వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వం తెలంగాణ ప్రభుత్వం  అనేక ఆదర్శనీయ నిర్ణయాలు తీసుకుని పురుషుల తో పోటీ పడి అన్నిరంగాల్లో ముందుంటున్న మహిళల కు అన్ని సదుపాయాలను కల్పిస్తూ మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని , తొలి సారి  మహిళ కార్పోరేషన్ ఏర్పాటు చేసిన ఘనత కూడా సీఎం కేసీఆర్ దేనన్నారు.. “మహిళల కోసం అనేక పథకాలు  అమలు చేస్తున్నామని  , కల్యాణ లక్ష్మీ , షాది ముబారక్,  ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులకు, బాలింతలకు, శిశువులులకు ప్రతి రోజు పాలు, గుడ్లతో కూడిన పోషకాహారాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. గర్భిణి స్త్రీలు దవాఖానలకు వచ్చిపోడానికి అమ్మఒడి వాహనాల ద్వారా ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించాం.. కేసీఆర్ కిట్స్ తో గర్భిణులకు ఆర్థికంగా సాయం అందిస్తున్నాం..ప్రస్తుతం దేశంలో ఎక్కడాలేని విధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, పోలీస్ ఉద్యోగ నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణే.. అలాగే, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు నెలనెలా రూ.2,016 పెన్షన్ అందజేస్తున్నాం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థినుల కోసం 53 డిగ్రీ గురుకుల కాలేజీలను ప్రారంభించాం.. ఆడపిల్లలకు హెల్త్, హైజీన్ కిట్స్ లను ప్రభుత్వం అందిస్తున్నదని మంత్రి హరీష్ రావు ప్రకటనలో  తెలిపారు.

Leave a Reply