Take a fresh look at your lifestyle.

మీరు ఆదర్శ దంపతులుగా వెలుగొందాలి

వీడియో కాల్‌ ‌ద్వారా తాను చదివించిన శ్రీలతకు మంత్రి హరీష్‌రావు శుభాకాంక్షలు

సిద్ధిపేట, మే 21(ప్రజాతంత్ర బ్యూరో) : స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మంచి మనస్సు గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరోసారి తన మంచి మనస్సు చాటుకుని నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. తాను చదివించిన విద్యార్థిని శ్రీలత ఓ ప్రయివేట్‌ ‌కంపెనీలో ఉద్యోగం సంపాదించడమే కాకుండా వివాహం చేసుకుంది. అయితే, వివాహానికి ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయిన మంత్రి హరీష్‌రావు వీడియో కాల్‌ ‌ద్వారా శ్రీలతకు శుభాకాంక్షలు తెలిపారు. వివరాల్లోకి వెళ్లితే…సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని మంత్రి హరీష్‌రావు దత్తత గ్రామమైన ఇబ్రహీంపూర్‌కు చెందిన శ్రీలతది చాలా నిరుపేద కుటుంబం. చదువుల్లో ముందంజలో ఉండటంతో మంత్రి హరీష్‌రావు శ్రీలతను బాసర త్రిబుల్‌ ఐటిలో చదివించారు. ఇటీవలనే శ్రీలత హైదరాబాద్‌లో ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదించింది. శనివారం ఇబ్రహీంపూర్‌లో శ్రీలతకు అదే గ్రామానికి చెందిన నరేందర్‌తో వివాహం జరిగింది. ఈ వివాహానికి మంత్రి హరీష్‌రావు పని వొత్తిడి వల్ల ప్రత్యక్షంగా హాజరు కాలేకపోవడంతో వివాహ వేడుకను వీడియో కాల్‌ ‌ద్వారా మంత్రి హరీష్‌రావు చూసి శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ పరిణయ శుభ ఘడియలను పని వొత్తిడిలో ప్రత్యక్షంగా వీక్షించి ఆనందించలేకపోతున్నా.

- Advertisement -

మీ దాంపత్య జీవితము సర్వవేళలా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలనీ, మీరు ఆదర్శ దంపతులుగా వెలుగొందాలి’ అని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ సీనియర్‌ ‌నాయకుడు, సుడా డైరెక్టర్‌ ‌మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, మంత్రి వ్యక్తిగత సహాయకుడు రాంచందర్‌రావు అలియాస్‌ ‌రాము వీడి•యో కాల్‌ ‌ద్వారా మాట్లాడించారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి నూతన ఒరవడికి మంత్రి హరీష్‌రావు శ్రీకారం చుట్టారు. శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్‌రావుకు నూతన వధువు శ్రీలత కృతజ్ఞతలు తెలిపారు.

వీడియో కాల్‌ ‌ద్వారా మంత్రి హరీష్‌రావు వివాహ శుభాకాంక్షలు తెలపవడంతో నూతన వధూవరుల సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. పెళ్లికి హాజరైన వాళ్లు కూడా మంత్రి హరీష్‌రావు వీడియో కాల్‌ ‌ద్వారా శ్రీలత దంపతులకు శుభాకాంక్షలు తెలపడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుంభాల ఎల్లారెడ్డి, సర్పంచ్‌ ‌దేవయ్య, నగేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Leave a Reply