Take a fresh look at your lifestyle.

‌ప్రజలకు మంత్రి హరీష్‌రావు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

జిల్లా ప్రజలకు స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు బతుకమ్మ పండుగ  శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారమిక్కడ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో కాళేశ్వరం జలాలతో కళకళలాడే చెరువుల వద్ద  శనివారం మహిళలు బతుకమ్మ పండుగ జరుపుకోవాలన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను జిల్లా  ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని  మంత్రి హరీష్‌రావు  అన్నారు.

దేశంలోనే పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కృతి మన తెలంగాణలో ఉందన్నారు. మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. గోదావరి జలాల బతుకమ్మ పండుగ చేసుకుంటామన్న మాటను నిజం చేశామనీ,  ఈ యేడు కాళేశ్వరం జలాలతో కళకళలాడుతున్న  గోదారమ్మ పరవళ్లు తొక్కుతున్న నిండు కుండలా ఉన్న చెరువుల్లో శనివారం బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నందకు సంతోషంగా ఉందన్నారు.

Leave a Reply