ఈదుల్ అజ్ హా(బక్రీదు)పండుగ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకూ, ప్రజలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో బక్రీద్ పండుగ ఒకటని అన్నారు. ఈ పండుగ త్యాగానికి ప్రతీక అన్నారు.
ప్రతి ఒక్కరూ బక్రీద్ పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా నుండి మక్కాకు హజ్ యాత్రికులు వెళ్లే వారు కానీ కొరోనా నేపథ్యంలో హజ్ యాత్ర లేకపోవడం కొంత బాధాకరం. అల్లా దయతో కొరోనా సైతాన్ తరిమేద్దామన్నారు. బక్రీద్ పండుగ రోజున ముస్లిం సోదరులు కొరోనా నేపథ్యంలో ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ఎవరి ఇంటి వద్ద వారే ప్రజలంతా సంతోషంతో, సుభిక్షంగా వుండాలని ప్రార్థన చేయాలన్నారు.