Take a fresh look at your lifestyle.

మల్లన సాగర్ ప్రధాన కాలువ పై మంత్రి హరీష్ రావు క్షేత్ర స్థాయి పర్యటన 

దుబ్బాక నియోజక వర్గ మల్లన్న సాగర్ ప్రధాన కాలువ పై మంత్రి హరీష్ రావు 4 గంటలు, 40 కిలో మీటర్ల మేర శుక్రవారం పర్యటించారు .సిద్ధిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ లోని కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-12 ద్వారా దుబ్బాకకు మల్లన్న సాగర్ ద్వారా నీళ్లు అందించే ప్రధాన కాలువను శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ మెదక్ ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తో కలిసి  రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు,పరిశీలించారు . ఏ కాలువ ద్వారా ఎన్ని క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి.! దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని మండలాలు, గ్రామాల వారీగా నిండాల్సిన చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు, వాగులు, వంకలు నిండాల్సినవి., ఎన్ని ఉన్నాయి. ? ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిండేలా నిల్వకు వాటి కెపాసిటీ ఎంత.? ఎంత మేర నీళ్లు చేరాల్సి ఉన్నది.? పారుతున్న నీళ్లలో భూమిలోకే ఇంకుతున్న నీళ్లు ఎంత మేర ఉంటాయని.. ఇరిగేషన్ అధికారులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆరా తీశారు. సిద్ధిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ లోని మల్లన్న సాగర్ ప్రధాన కాలువ వెంట కలియ తిరుగుతూ.. కాలువ ద్వారా నీళ్లు అందే స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.దుబ్బాక ప్రధాన కాలువ ద్వారా నీళ్లు పారనున్నతొగుట మండలంలోని తుక్కాపూర్, పెద్ద మాసాన్ పల్లి, ఎల్లారెడ్డి పేట, బండారుపల్లి, సిద్ధిపేట నియోజక వర్గంలోని సిద్ధిపేట అర్బన్ మండలం తడ్కపల్లి, సిద్ధిపేట రూరల్ మండలంలోని వెంకటాపూర్, ఇర్కోడ్, తోర్నాల, చింతమడక, దుబ్బాక నియోజకవర్గంలోని అప్పన్న పల్లి, చెల్లాపూర్ తదితర గ్రామాల మీదుగా ఉన్న ప్రధాన కాలువలో పలుచోట్ల అసంపూర్తి పనులపై ఇరిగేషన్ అధికారులపై మంత్రి అగ్రహం వ్యక్తం చేసారు .
 మల్లన్న సాగర్ ద్వారా గోదావరి జలాలు వచ్చాయని., మల్లన్న సాగర్ తో దుబ్బాక నియోజకవర్గానికి మొత్తం లక్ష 25 వేల ఏకరాలకు సాగునీరు అందుతుంది..సీఏం కేసీఆర్ కృషితోనే దుబ్బాక నియోజకవర్గ రైతాంగానికి 8 కాల్వల ద్వారా 66 వేల ఏకరాలకు సాగునీరు, సిద్ధిపేట నియోజకవర్గంలో 4 కాల్వల ద్వారా 35 వేల ఏకరాలకు, గజ్వేల్ నియోజకవర్గంలో 1543 ఏకరాలకు, రాజన్న సిరిసిల్లా జిల్లాలో 5 కాల్వల ద్వారా 21 వేల 976 ఏకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే కల సాకారమైందని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు . ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏస్ఈ ఆనంద్, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply