- దుబ్బాక నియోజకవర్గంలో మంత్రి హరీష్‌రావు పర్యటన
- వర్షంలోను పెద్ద సంఖ్యలో హాజరయిన ప్రజలు
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు శుక్రవారం సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో పర్యటించారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు, అంబులెన్స్ ప్రారంభం, సిసి రోడ్ల నిర్మాణ పనులతో పాటు పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా దౌల్తాబాద్ మండలం గోవిందాపూర్ గ్రామంలో రూ.7 లక్షల వ్యయంతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్, రూ.30 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఆర్అండ్బి సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు, రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన గోదాంను మంత్రి హరీశ్ రావు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ పర్యటనలో జోరు వాన కురిసినప్పటికీ..మంత్రి హరీష్‌రావు వానలతో తడుస్తూనే కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఓ వైపు భారీ వాన వస్తున్నప్పటికీ…మంత్రి హరీష్‌రావు చత్రి పట్టుకుని కార్యక్రమాలో పాల్గొనడంతో పాటు హరీష్‌రావుకు జనం అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. గ్రామంలో గృహాలు ఉన్న స్థలంలోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు జరిపేలా జిల్లా కలెక్టర్‌కు సూచించనున్నట్లు మంత్రి తెలిపారు. రూ.33 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న డ్రైనేజీ నిర్మాణానికి మరో రూ.8 లక్షలు వెచ్చించి అదనపు పనులు చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. అనంతరం సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కొనాయపల్లిలో రూ.20 లక్షల నిధులతో నిర్మాణం చేపట్టనున్న నూతన గ్రామ పంచాయితీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన స్థాపన చేశారు.
దుబ్బాక నియోజక వర్గంలో..రోడ్ల నిర్మాణాలకు రూ.12 కోట్లు విడుదల
సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గువ్వలేగి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన పంచాయతీ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలో ఆర్అండ్బి శాఖ ఆధ్వర్యంలో రోడ్ల నిర్మాణాలకు రూ.12 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. వ్యవసాయ బావుల కరెంటు మోటర్లకు మీటర్లు బిగింపు చేపట్టేలా పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టాలని నిర్ణయిస్తున్నదని, కేంద్రం బీజేపీ ప్రవేశ పెట్టనున్న బిల్లును వ్యతిరేకిస్తూ దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ మేరకు గువ్వలేగి గ్రామం టీఆర్ఎస్ పార్టీకే మా వోటు అంటూ ఏకగ్రీవంగా తీర్మాణం చేసి తీర్మాన ప్రతులను మంత్రికి అందించారు. కాగా గువ్వలేగి గ్రామస్తులు.. బ్రహ్మరథం పట్టి బతుకమ్మ బోనాలతో స్వాగతం పలుకుతూ తమ అభిమానం చాటారు. ముందుగా రూ.5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బీడీ కార్మికుల ఖార్కనా భవనానికి ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. రైతుల సంక్షేమం కోసం కృష్జి చేస్తున్న ప్రభుత్వమని మంత్రి పేర్కొన్నారు. ఇందుప్రియాల్ గ్రామంలో రూ.75 లక్షల వ్యయంతో నిర్మించనున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన, అలాగే రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన మత్స్యకారులు కార్మిక భవనాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. మంత్రి వెంట రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకుడు రణం శ్రీనివాస్‌గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.