Take a fresh look at your lifestyle.

నేను హరీష్ రావు.. మినిస్టర్ ని… !!

అమ్మ మంచిగా అయిందా….డాక్టర్లు పట్టించుకుంటున్నారా… !! 
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రం లో కారులో వెళుతూ ఎ ఎన్ ఎం ల ద్వారా కరోనా పేషంట్స్ కుటుంబాలతో మాట్లాడి.. వారి బాగోగులు తెల్సు కొని మంత్రి హరీష్ రావు భరోసానిచ్చారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న  కొరోనా మహమ్మారి తో ప్రజలు , దాని బారిన పడిన బాధితులు ధైర్యంగా ఉండేలా ఏ జిల్లాకు వెళ్లిన , ఏ నియోజకవర్గానికి వెళ్లిన  కొరోనా కేసు ఉందంటే చాలు వారికి ఆత్మవిశ్వాసం నింఫుతు అధైర్య పడకుండా నేను ఉన్నాను అని మంత్రి హరీశ్ రావు భరోసా ఇస్తున్నారు.శుక్రవారం నాడు సంగారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి హరీష్ రావు  జిన్నారం మండల కేంద్రం లో కారులో వెళుతున్న క్రమంలో అక్కడే ఉన్న ఏ ఎన్ ఎం లను పలకరించారు.
మీ ఊరిలో కొరోనా కేసులు ఏమైనా ఉన్నాయా.. ఉంటే ఎన్ని ఉన్నాయ్.. వారి.హోం ఐసోలేషన్ లో ఉన్న వారి దగ్గరికి వెళుతున్నారా..వార్కి ముందుకు ఇస్తున్నారా…!! అని ఆరా తీశారు..ఒక పేషంట్ కి ఫోన్ కలపండి అని ఏ ఎన్ ఎం ల ద్వారా దుర్గా అనే కొరోనా పేషంట్ కు ఫోన్ చేసారు.. ఆ పేషంట్ కొడుకు ఫోన్ మాట్లాడటం తో… ” నేను హరీష్ రావు మినిస్టర్ అని చెపుతూ.. అమ్మ మంచిగా అయిందా…. డాక్టర్లు పట్టించుకుంటున్నారా… !! అమ్మ ఆరోగ్యంగా ఉందా.. వైద్య సిబ్బంది వస్తున్నారా…! మందులు ఇస్తున్నారా…ఎన్ని సార్లు వచ్చారు అని అడిగి తెల్సు కున్నారు…దానితో అతను వస్తున్నారు సర్ .ఫోన్ కూడా చేస్తున్నారు సార్…. అమ్మ ఇప్పుడు మంచిగా అయింది సార్ అంటూ సమాధానం ఇచ్చారు… !! ” అధైర్య పడకండి.. ఆందోళన చెందకండి అండగా ఉంటామని వారిలో ఆత్మవిశ్వాసం నింపి భరోసానిచ్చారు.

Leave a Reply