Take a fresh look at your lifestyle.

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి హరీశ్ రావు

ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా గురువారం రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తిరుమల వెంకటేశ్వరస్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. స్వామి వారి దీవెనలు తెలంగాణ రాష్ట్రంపై ఉండాలని, రాష్ట్ర ప్రజలు కోవిడ్ బారిన పడకుండా చూడాలని కోరుకున్నట్టు చెప్పారు.
మంత్రి వెంట మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, సిద్దిపేట జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, చిన్నకోడూరు ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, వైఎస్ ఎంపీపీ కీసరి పాపయ్య, ఏఎంసీ చైర్మన్ కాముని శ్రీనివాస్, తదితరులు కుటుంబ సమేతంగా పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, ఎంపీపీ మాణిక్యరెడ్డి, వైస్ ఎంపీపీ పాపయ్య, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్  స్వామి వారికి తలనీలాలు సమర్పించారు.

Leave a Reply