Take a fresh look at your lifestyle.

జర్నలిస్టు,ఎమ్మెల్యే రామలింగా రెడ్డి పాడే మోసిన హరీష్ రావు..

  • అన్నీ తానై వ్యవహరించిన మంత్రి ..
  • అంతిమ యాత్రలో .. కాలినడకన 
  • శాసన సభ్యులు రామలింగా రెడ్డి  భౌతికకాయం  వెంట మంత్రి హరీష్ రావు 
శాసన సభ్యులు రామలింగా రెడ్డి మరణ వార్త తెలిసిన వెంటనే  కుటుంబ సభ్యులను మంత్రి  హరీష్ రావు   ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించారు. మృతదేహం వచ్చినప్పటి నుంచి అంత్యక్రియల వరకు దగ్గరుండి ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. అంతిమ యాత్రలో సూచనలు చేస్తూ అన్నీతానై వ్యవహరించారు.
 దుబ్బాక శాసన సభ్యులు రామ లింగా  రెడ్డి   మృతదేహం హైదరాబాద్ నుంచి స్వగ్రామం చిట్టాపూర్  వచ్చేవరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. అంతిమసంస్కారాలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్ల కోసం  అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు. దహన సంస్కారాలు జరిగే చోట అవసరమైన అన్ని ఏర్పాట్లను మంత్రి  దగ్గరుండి చేయించారు .
పూలతో అలంకరించిన వాహనంలో శాసన  సభ్యులు రామ లింగా  రెడ్డి భౌతిక కాయాన్ని ఉంచి అంతిమ యాత్ర నిర్వహించారు .    అంతిమ యాత్ర ప్రారంభంలో కొద్ది సేపు పాడే ను మోసారు . అంతిమయాత్రలో ముందుండి సుమారు  కిలోమీటరున్నర దూరం వరకు కాలినడకన సాగారు.
కడసారి అంతిమ వీడ్కోలు పలికేందుకు.. రామలింగా రెడ్డి బంధువులు,
ప్రజలు,అభిమానులు,ప్రజలు   పెద్ద ఎత్తున తరలివచ్చారు. దారిపొడవునా ఇరువైపులా జనం నిలబడి నివాళి అర్పించారు.  శాసన సభ్యులు  రామలింగా రెడ్డి అమరహై అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినదించారు . అమర్ రహే అంటూ అంతిమ యాత్ర సాగుతున్నంత సేపూ ప్రజల  నినాదాలు మిన్నంటాయి….

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply