Take a fresh look at your lifestyle.

టి ఆర్‌ ఎస్‌ ‌కంచుకోట సిద్దిపేట..

అభివృద్ధి కె పట్టం కట్టిన ప్రజలు.
సిద్దిపేట ప్రజలకు ధన్యవాదాలు, గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్‌ ‌రావు
సిద్దిపేట నాడు ఉద్యమం.. నేడు అభివృద్ధి లో ఆదర్శంగా నిలిచింది అని..టి ఆర్‌ ఎస్‌ ‌పార్టీ కి సిద్దిపేట కంచుకోట అని సిద్దిపేట ప్రజలు మరో సారి నిరూపించారు.. అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టారు అని మంత్రి హరీష్‌ ‌రావుహొ అన్నారు.. సిద్దిపేట లో వెలువడిన ఎన్నికల ఫలితాలు సందర్భంగా మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతు సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల్లో 36 స్థానాల్లో టి ఆర్‌ ఎస్‌ ‌పార్టీహొ గెలుపొందిందన్నారు..

5 స్థానాల్లో స్వతంత్రులు రెబల్‌ అభ్యర్థులు గెలుపొందారు , ఒక్కో స్థానాల్లో బిజేపీ, ఎం ఐ ఎం అభ్యర్థులు గెలుపొందరన్నారు.. మొత్తంగా సిద్దిపేట మున్సిపాలిటీహొ టి ఆర్‌ ఎస్‌ ‌కైవసం చేసుకుందన్నారు.. అభివృద్ధి సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టారన్నారు.. ఇది టి ఆర్‌ ఎస్‌ ‌పార్టీ , ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ ‌పై నమ్మకం విశ్వసనీయతకు నిదర్శనం అని అన్నారు.. ఇంత గొప్ప విజయం ఇచ్చిన సిద్దిపేట ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు..గెలుపొందిన అభ్యర్థులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.. సిద్దిపేట ప్రజలు గోప్ప చైతన్య వంతులు అని వారికి మంచి సేవ చేసి ప్రజల మన్ననలు పొందాలని గెలుపొందిన టి ఆర్‌ ఎస్‌ అభ్యర్థులకు సూచించారు.

Leave a Reply