Take a fresh look at your lifestyle.

మంత్రి  హరీష్‌రావుకు కొరోనా పాజిటివ్‌

minister

అసెంబ్లీ సమావేశానికి దూరం ..!
త్వరగా కోలుకోవాలని మంత్రి కెటిఆర్‌ ‌ట్వీట్‌

‌తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌ ‌రావుకు కొరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా నిర్వహించిన కొరోనా పరీక్షల్లో హరీశ్‌కు  పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్‌ ‌ద్వారా తెలిపారు. తనకు కొరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని.. టెస్టులో పాజిటివ్‌గా తేలిందన్నారు. తాను ఆరోగ్యంగా బాగానే ఉన్నానని ట్విట్టర్‌లో తెలిపారు. ఇటీవల తనను కలిసిన ప్రజాప్రతినిధులు, అధికారులను టెస్టులు చేయించుకోవాలని సూచించారు. అయితే కొరోనా పాజిటివ్‌ ‌నేపథ్యంలో ఆయన సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు దూరం కానున్నారు. ఇటీవల పలు కార్యక్రమాల్లో బిజీగా తిరగడం వల్లనే పాజిటివ్‌ ‌వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌ ‌రావుకు కొరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ పలువురు ట్విట్టర్‌ ‌వేదికగా అభిలషించారు. హరీశ్‌ ‌ట్వీట్‌పై స్పందించిన పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌… ’‌బావా త్వరగా కోలుకో.. ఇతరులకంటే త్వరగా కోలుకుంటావన్న నమ్మకం నాకుంది’ అని ట్వీట్‌ ‌చేశారు. సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కొరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లోనే హరీశ్‌కు పాజిటివ్‌గా తేలింది.

Leave a Reply