Take a fresh look at your lifestyle.

కొరోనాను జయించిన మంత్రి  హరీష్‌ రావు 

అసెంబ్లీకి హాజరు

కొరోనాను జయించి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు అసెంబ్లీకి హాజరయ్యారు. సమావేశాల ప్రారంభం సందర్బంగా ఆయనకు కొరోనా పాజిటివ్‌గా వచ్చింది. దీంతో ఆయన సమావేశాలకు దూరంగా ఉన్నారు. అయితే హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకోవడంతో కొరోనా నెగెటివ్‌గా వచ్చింది.  ఈ నేపథ్యంలో మంత్రి హరీష్‌రావు సోమవారం శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రికి స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇక మిగతా ఎమ్మెల్యేందరూ కూడా కొవిడ్‌-19 ‌టెస్టులు చేయించుకున్నందుకు స్పీకర్‌ ‌వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. టెస్టులు చేయించుకోని ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పనిసరిగా కొవిడ్‌ ‌పరీక్షలు చేయించుకోవాలని స్పీకర్‌ ‌విజ్ఞప్తి చేశారు. ప్రతి సభ్యుడు కొవిడ్‌ ‌నిబంధనలు చేపట్టాలని సభ్యులను స్పీకర్‌ ‌కోరారు.

Leave a Reply