Take a fresh look at your lifestyle.

టీచర్‌గా మంత్రి హరీశ్‌రావు

  • కొత్తపల్లి జెడ్‌పి సాఠశాలలో పిల్లలకు పాఠాలు
  • పిల్లల్ని బడికి తీసుకెళ్లినట్లే.. గ్రౌండ్‌కు కూడా తీసుకెళ్లాలి

ఎప్పుడూ రాజకీయాలతో బిజీగా ఉండే మంత్రి హరీష్‌ ‌రావు టీచర్‌ అవతారం ఎత్తారు. మెదక్‌ ‌జిల్లా పాపన్న పేట మండలం, కొత్తపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ‌పాఠశాల లో మంత్రి హరీశ్‌ ‌రావు పాఠాలు చెప్పిన అంశం ఆసక్తికరంగా మారింది. ఈరోజు కొత్తపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ‌పాఠశాలను తనిఖీ చేసిన ఆయన కొరోనా అనంతరం పాఠశాల ఎలా నడుస్తుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తెలుగు, లెక్కల సబ్జెక్టు లలో విద్యార్థులను మంత్రి హరీష్‌ ‌రావు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. డాక్టర్‌ ‌కావాలంటే ఏం చదవాలి….డాక్టర్‌ అయితే అమెరికా వెళ్తావా….ఇక్కడ ఉండి ప్రజలకు సేవ చేస్తావా అని విద్యార్థి మనోగతాన్ని మంత్రి అడిగి తెలుసుకున్నారు. పోలీసు అవుతాన్న విద్యార్థితో…పోలీసయితే ఏం చేస్తావని మంత్రి ప్రశ్నించారు. ఇక ఆ తరువాత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పై మాట్లాడమని విద్యార్థులను మంత్రి కోరారు. అనంతరం తెలుగు నుడికారాలు , జాతీయాలు, సామెతలు, సోంత వాక్యాలపై ప్రశ్నలు వేశారు. అలానే కరోనా వల్లచదువు కోల్పాయారా అని ఆరా తీసిన మంత్రి మధ్యాహ్న బోజన వసతి పై కూడా ఆరా తీశారు.

minister harish rao at school
minister harish rao at school

పిల్లల్ని బడికి తీసుకెళ్లినట్లే.. గ్రౌండ్‌కు కూడా తీసుకెళ్లాలి
పిల్లల్ని బడికి తీసుకెళ్లినట్లే గ్రౌండ్‌ ‌కూడా తీసుకెళ్లేలా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని మంత్రి హరీష్‌ ‌రావు కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలను ప్రతి ఒక్కరూ క్రీడల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మెదక్‌ ‌జిల్లా మనోహరాబాద్‌ ‌మండలం ముప్పిరెడ్డి పల్లి గ్రామంలో సీఎం కేసీఆర్‌ ‌క్రికెట్‌ ‌టోర్నమెంట్‌ ‌ను మెదక్‌ ఎం‌పీ కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ ‌హేమలత శేఖర్‌ ‌గౌడ్‌తో కలసి మంత్రి హరీష్‌ ‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటపాటలు లేక పిల్లల్లో శారీరక పటుత్వం తగ్గిపోయిందని, సెల్‌ ‌ఫోన్ల కు అలవాటు పడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఊబకాయం, బీపీ, షుగర్లు కొని తెచ్చుకుంటున్నారని, ఇవి రాకుండా ఉండాలంటే వ్యాయమం అవసరం అని మంత్రి పేర్కొన్నారు. గేమ్స్ అం‌టే టైం వేస్ట్ అనుకుంటున్నారు.. కానీ పబ్‌ ‌జీ, ఫేస్‌ ‌బుక్‌ ‌లాంటి వల్లనే నిజంగా చాలా టైంవేస్ట్ ‌చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. క్రీడల వల్ల ఆత్మ స్థైర్యం తోపాటు పోటీ తత్వం పెరుగుతుందని, ఓటమిని హుందాగా స్వీకరించే తత్వం అలావాటవుతుందని మంత్రి హరీష్‌ ‌రావు వివరించారు. పరీక్షల్లో పాస్‌ ‌కాలేకపోతే వెంటనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. దీనికి ప్రధాన కారణం క్రీడాస్ఫూర్తి అలవాటు లేకపోవడమేనన్నారు. సీఎం పేరుతో ఈ టోర్నమెంట్‌ ‌నిర్వహించిన విష్షు జగతికి మంత్రి హరీష్‌ ‌రావు అభినందనలు తెలిపారు.

Leave a Reply