Take a fresh look at your lifestyle.

గూడు లేని గరీబోల్లకే… డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు

జోర్డార్‌ ‌వసతులతో…. నయా పైసా ఖర్చు లేకుండా..
మీరు నా కుటుంబం..నేను మీ కుటుంబ సభ్యుడిని
సిద్ధిపేటలో 216 మంది లబ్దిదారులకు పట్టాలు అందజేసినమంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు

ఎన్నో ఏండ్ల పేదల కల నెరవేరి నందు కు నాకు సంతోషంగా ఉంది…మీ పెదవుల మీద ఆనందం చూస్తే బిర్యానీ తిన్న ఆనందం నాకు కలిగింది…మీరే నా కుటుంబం… నేను మీ కుటుంబ సభ్యుడినీ…పెద్దల గేటెడ్‌ ‌కమ్యూనిటీ ఇండ్ల మాదిరి అన్ని సౌకర్యాలు తో కూడిన డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్ల ను గూడు లేని అసలైన గరీబొల్లకే కేటాయించామని మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు తెలిపారు. సోమవారం సిద్దిపేట కేసిఆర్‌ ‌నగర్‌ ఆడిటోరియం లో 8 వ వార్డు నర్సా పూర్‌ ‌కాలనీలో మూడో దఫా 216 మంది డబుల్‌ ‌బెడ్‌ ‌రూం లబ్ధిదారులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు సతీ సమేతంగా పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌రావు లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ నిరుపేదల స్వంతింటి కలను నిజం కాబోతున్న అందుకు తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆశీస్సులతో… నర్సాపూర్లో 2460 రెండు పడక గదుల ఇల్లు నిర్మాణం సకల సౌకర్యాలతో ప్రైవేట్‌ ఇం‌డ్ల సముదాయాల కు ధీటుగా పూర్తి చేశామన్నారు. ఈ ఇళ్ళు నిర్మించేందుకు మాకు నాలుగేళ్ల సమయం పట్టిందని మంత్రి తెలిపారు. ఈ నాలుగేళ్లలో నాలుగు వందల సార్లు జిల్లా కలెక్టర్‌, ‌మున్సిపల్‌ ‌చైర్మన్‌, ‌కౌన్సిలర్‌ ‌లతో కలిసి నిర్మాణ స్థలాన్ని సందర్శించి స్వంత ఇంటి మాదిరి మనసు పెట్టీ ఇండ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు.

మొదటి దశలో 1341 మంది లబ్ధిదారులను గుర్తించామనీ
మంత్రి తెలిపారు. నిజమైన పేదలకు ఇల్లు దక్కాలని ఆరు నెలలు కష్టపడి జల్లెడ పట్టి ఏలాంటి ఆరోపణలకు తావులేకుండా పేదరికమే ప్రామాణికంగా అర్హులను మాత్రమే ఎంపిక చేశామన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని బాజప్తా వార్డు గోడలపై లబ్దిదారుల జాబితా ప్రదర్శించసమన్నారు. జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, ‌జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా అధికారుల తో సహా 200కు పైగా అధికారులు అహర్నిశలు శ్రమించారని మంత్రి గుర్తు చేశారు. కేటాయింపు రాజకీయ జోక్యం లేకుండా జాగ్రత్త లు తీసుకున్నామన్నారు. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు స్థానిక కౌన్సిలర్‌ ‌లు సహకరించాలన్నారు. నయా పైసా ఖర్చు లేకుండా ఒక్క పైసా లంచం లేకుండా ఇండ్ల కేటాయింపు జరిపామన్నారు. ఎవరైనా ఒక్క పైసా లంచం ఇచ్చినట్టు చెప్పండి…వారికి రూ.10 వేల బహుమానం ఇస్తానని మంత్రి తెలిపారు. ప్రతిగా లబ్దిదారులు స్పందిస్తూ తమను ఎవ్వరూ ఒక్క పైసా లంచం అడగలేదని..తెలిపారు. తొలి దశలో ముఖ్యమంత్రి సమక్షంలో 144 మంది లబ్ధిదారులకు గృహ ప్రవేశాలు చేశారన్నారు. రెండో దశలో 180 మందికి పట్టాలు పంపిణీ చేశామన్నారు. ప్రతీ ఇంట్లో గృహ విద్యుత్‌, ‌నల్లా, గ్యాస్‌ ‌కనెక్షన్‌, ‌పైపులు అన్ని సక్రమంగా పని చేస్తున్నా యో లేదో సరి చూసుకుంటూ దశల వారీగా లబ్ధిదారుల కు పట్టాలు అందిస్తూ గృహ ప్రవేశాలు జరిగేలా చూస్తున్నామన్నారు. ఇంకా మిగిలిన 1000 ఇండ్లకు సంబంధించి పున:పరిశీలన ప్రక్రియ జరుగుతుందని వారిలో అర్హులైన వారికి త్వరలోనే రెండు పడక గదుల ఇళ్లను కేటాయిస్తామన్నారు. ఏ ఒక్క నిరుపేదకు అన్యాయం జరగకూడదన్న ధ్యేయంతో సాంకేతికత దన్నుగా బిగ్‌ ‌డేటా తో సరిపోల్చు తూ…అర్హులకే మాత్రమే లబ్ది పొందేలా చూస్తున్నా మన్నారు.మరో 1000 ఇండ్లు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేయగా వెంటనే మంజూరు చేశారన్నారు.

జోర్డార్‌ ‌వసతులతో…. నయా పైసా ఖర్చు లేకుండా..
బహిరంగ విపణిలో రూ.15 లక్షలు విలువ చేసే డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్లను సకల సౌకర్యాలతో పేదలకు ఉచితంగా అందిస్తున్నా మన్నారు.లబ్ధిదారులకు పట్టాలు అందజేసే సమయంలో నే…. పట్టా ఉత్తర్వు తో పాటు..నల్లా కనెక్షన్‌ ‌మంజూరు పత్రం, కరెంట్‌ ‌కనెక్షన్‌ , ఇం‌టి నెంబర్‌, ‌పైపుడ్‌ ‌గ్యాస్‌ ‌కనెక్షన్‌ ‌లు అందజే స్తున్నా మన్నారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ తో కేసిఆర్‌ ‌నగర్‌ ‌ను అనుసంధానం చేశామన్నారు. ఫలితంగా ఉపరితల మురుగు కాల్వలు ఉండవన్నారు. దోమలు, పందుల బెడద తప్పి..అనారోగ్యం దరిచేరదన్నారు. అంతే కాకుండా స్వంత అన్నయ్యలా ఆశీర్వదిస్తూ…తనే వస్త్రాలు బహుకరించి గృహ ప్రవేశాలు చేయిస్తున్నామన్నారు. కేటాయించిన పక్కా ఇండ్లను పది కాలాల పాటు కాపాడు కోవాల్సిన బాధ్యత లబ్ధిదారుల దేనన్నారు. ఇండ్లను కిరాయికి ఇచ్చినా, అమ్ముకున్నా నేరమని తిరిగి స్వాధీనం చేసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

కలెక్టర్‌ ‌పై ప్రశంసల జల్లు… సన్మానం
కెసిఆర్‌ ‌నగర్‌లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడంలో జిల్లా కలెక్టర్‌ ‌వెంకట్రామ రెడ్డి కృషి అనన్యసామాన్యమైనదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. గృహ సముదాయం అందంగా రావడం లో ఇళ్ల నిర్మాణం క్వాలిటీతో పూర్తి చేయడంలో కలెక్టర్‌ ‌ప్రత్యేక చొరవే కారణమన్నారు. రెండు పడక గదుల ఇల్లు కేటాయింపులో అత్యంత పారదర్శకంగా జరిగేలా కలెక్టర్‌ ‌ప్రత్యేక శ్రద్ద చూపారని ప్రశంసించారు. ఇండ్లు త్వరగా అందించాలని తాను ఎన్నో సార్లు ఒత్తిడి చేశానని అన్నారు. అయినప్పటికీ ఓపిగ్గా నిజాయితీగా పనిచేసి ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేలా చూశారని తెలిపారు. ఒక మంచి కలెక్టర్‌, ఎమ్మెల్యే ఉంటే దాని ఫలితం ఎలా ఉంటుందో దాని ఫలితం మీరు చూస్తున్నారని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ ‌ను శాలువా, ప్రత్యేక జ్ఞాపికతో మంత్రి సత్కరించారు. అనంతరం మంత్రి డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్ల లబ్ధిదారుల కుటుంబం సభ్యులకు మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు సతీ సమేతంగా ఇండ్ల పట్టాలు, నూతన వస్త్రాల బహుకరించారు. కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్‌, ఎం‌సీఆర్‌హెచ్‌ఆర్‌డీ సీనియర్‌ ‌ఫ్యా కల్టీ అసోసియేట్‌ ‌ప్రొఫెసర్‌ ‌డా. ఉషారాణి, మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌రాజనర్సు, వైస్‌ ‌చైర్మన్‌ అక్తర్‌ ‌పటేల్‌, ఏఎం‌సి చైర్మన్‌ ‌పాల సాయి రాం, ఆర్‌డిఓ జయ చంద్రా రెడ్డి, సుడా వైస్‌ ‌చైర్మన్‌ ‌రమణ చారి , మున్సిపల్‌ ‌కౌన్సిలర్‌లు తదితరులు పాల్గొన్నారు.

కెసీఆర్‌ ‌నగర్‌ ‌డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్ల పరిశీలనకు జగిత్యాల ఎమ్మెల్యే
పెద్దింటి ఇండ్ల మాదిరే నిర్మించారు..జగిత్యాలలో ఇదే మాదిరి ఇండ్ల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే డా.సంజయ్‌ అన్నారు. సిద్దిపేట కెసిఆర్‌ ‌నగర్‌లో నిర్మించిన డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్ల పరిశీలనకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ ‌సంజయ్‌ ‌సోమవారం వొచ్చారు. ఇండ్లు ఎలా నిర్మించారు.. మౌలిక సదుపాయాల కల్పన ఎలా చేశారు…ఇండ్ల కేటాయింపు ఎలా జరిపారు ..అన్న వివరాలను రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు, జిల్లా కలెక్టర్‌ ‌వెంకట్రామిరెడ్డిని ఆయన అడిగి తెలుసుకున్నారు. సిద్దిపేట కెసీఆర్‌ ‌నగర్‌లో గృహ సముదాయం చూడ చక్కగా ఉందన్నారు. సిద్దిపేట మాదిరే జగిత్యాలలో నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టి అందిస్తామన్నారు.

Leave a Reply