Take a fresh look at your lifestyle.

నల్లగొండ ఫ్లోరైడ్‌ ‌పీడ విరగడైంది

ఆనాటి కెసిఆర్‌ ‌పాటను అసెంబ్లీలో పాడిన మంత్రి హరీష్‌ ‌రావు
2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌ ‌రావు వార్షిక బడ్జెట్‌ ‌ప్రవేశ పెట్టిన సందర్భంగా నల్లగొండ ఫ్లోరైడ్‌ ‌గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన కెసిఆర్‌ ‌రాసిన పాట పాడారు. ’చూడు చూడు నల్లగొండ… గుండె మిద ప్లోరైడ్‌ ‌బండ.. బొక్కలొంకరుబోయిన బతుకులా.. మన నల్లగొండ.. దుఃఖమెల్లాదీసేదెన్నాళ్లు’ ఇది నల్లగొండ తాగునీటి కష్టాలను చూసి చలించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌స్వయంగా రాసిన పాటని మంత్రి చెప్పారు. ఆనాడు ఫ్లోరైడ్‌ ‌దుఃఖం మిద ఆవేదనతో పాటరాసిన ఆయనే ఈనాడు ఫ్లోరైడ్‌ ‌పీడను శాశ్వతంగా తొలగించారన్నారు.

నల్లగొండలో ప్లోరైడ్‌ ‌పీడ అంతమైందని, కొత్తగా ఎవరూ ప్లోరోసిస్‌ ‌బారిన పడడంలేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ ‌వేదికగా ప్రకటించిందని హరీశ్‌ ‌రావు అన్నారు. మిషన్‌ ‌భగీరథ పథకం నల్గగొండ ఎ•-లోరైడ్‌ ‌కష్టాలకు చరమగీతం పాడిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎండాకాలం వస్తే.. మహిళలు కుండలు పట్టుకుని మైళ్ల దూరం నడిచి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు.

ఆదిలాబాద్‌ ఆదివాసి ప్రాంతంలో జనం కలుషిత నీరు తాగి డయేరియా కారణంగా మరణాలబారిన పడేవారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఐదేళ్లలోనే తాగునీటి కష్టాలు తీర్చారన్నారు. ప్రభుత్వం పట్టుదలతో పనిచేసి మిషన్‌ ‌భగీరథ పథకాన్ని వేగంగా పూర్తి చేసిందని, తద్వారా రాష్ట్రంలోని అన్ని అవాసాలకు శుద్ధి చేసిన సురక్షిత జలాలు ఇంటింటింకి నల్లాల ద్వారా అందుతున్నాయని హరీశ్‌ ‌రావు పేర్కొన్నారు.

Leave a Reply