Take a fresh look at your lifestyle.

ఈద్ ముబారక్ ..

  • రాష్ట్ర ప్రజలకు , ముస్లిం సోదర ,  సోదరీమణులకు  పవిత్ర  రంజాన్ శుభాకాంక్షలు…
  • ఇంట్లోనే పండుగను జరుపుకుని అందరం బాగుండాలని అల్లాను ప్రార్ధించండి… 
  • మంత్రి హరిశ్ రావు
ముస్లింల పవిత్ర పండుగైన రంజాన్ పండుగ పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు , ముస్లిం సోదర సోదరీమణులకు మంత్రి హరీష్ రావు  రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంజాన్ పండుగ పవిత్రతకు ,త్యాగానికి చిహ్నమని , పండుగను   భక్తి శ్రద్దలతో , ఆనందోత్సవాలతో జరుపుకోవలన్నారు. సేవాదృక్పథ భక్తి ప్రవృతులు , సోదరభావాలు మత సామరస్యాన్ని చాటి చెప్పే ఈ పండుగను ముస్లిం సోదరులు సంతోషం గా జరుపుకోవాలని ఆకాంక్షించారు… రంజాన్ పండుగను రాష్ట్ర పండుగగా మన ప్రభుత్వం గుర్తించిందన్నారు.. కొరోన వ్యాప్తి నేపథ్యంలో ఈ పండుగను సామూహికంగా జరుపులేక పోతున్నాం అని.
ఎవరి ఇంట్లో వారే  వేడుకగా జరుపుకుని యావత్ ప్రపంచ ప్రజలు అందరం బాగుండాలి అని కొరోనా మహమ్మారి బారి  నుండి అందరం బయట పడాలని ఆ అల్లాని ప్రార్ధించాలని కోరారు.  పేద ముస్లిం లకు రంజాన్ తోఫా ను అందించాం అని ,  మైనార్టీ ల  అభ్యున్నతికి ప్రభుత్వం  కృషి చేస్తుంది ..ముస్లిం ల కొరకు అనేక కార్యకమాలు చేసుకుంటున్నాం అని అన్నారు…. రంజాన్ మాసమంతా  ప్రపంచ వ్యాప్తంగా నిష్టతో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply