Take a fresh look at your lifestyle.

వరదలు వొస్తే డబ్బులు ఎందుకు ఇవ్వలేదు

  • హైదరాబాద్‌కు వొచ్చి వోట్లు ఎలా అడుగుతారు?
  • రోడ్‌ ‌షోలో పాల్గొన్న మంత్రి హరీష్‌ ‌రావు

జీహెచ్‌ఎం‌సి ఎన్నికలలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. బుధవారం 112 డివిజన్‌ ‌రామచంద్రపురంలో మంత్రి హరీష్‌ ‌రావు రోడ్‌ ‌షోలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అభ్యర్థులను గెలిపిస్తుందని మంత్రి అన్నారు. అభివృద్ధి టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం లోనే సాధ్యమవుతుందని, ప్రతిపక్షాల మాటలలో ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ లేవని గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నాయకులు దిగుతున్నారు. అయ్యా ఢిల్లీ నుంచి వచ్చే బీజేపీ నాయకులు తెలంగాణకు ఎన్ని డబ్బులు ఇచ్చారో చెప్పాలి. తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. గత యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాజెక్టును అడ్డుకొని తెలంగాణకు అన్యాయం చేశారు.

హైదరాబాద్‌ ‌జంట నగర ప్రజలు బ్యాలెట్‌ ‌ద్వారా తగిన బుద్ధి చెబుతారు. హైదరాబాద్‌లో వరదలు వొస్తే ఎందుకు డబ్బులు ఇవ్వలేదు. బెంగుళూరుకు ఒక న్యాయం హైదరాబాద్‌కు ఒక న్యాయమా? సహాయం చేయరు కానీ, హైదరాబాద్‌కు వొచ్చి ప్రజలను ఏ విధంగా అడుగుతారు. స్వయంగా  ముఖ్యమంత్రి కేసీఆర్‌  ‌వరద బాధితులను ఆదుకోవాలని లెటర్‌ ఇచ్చినా ఎలాంటి స్పందన లేదు. మా డబ్బులు వెంటనే విడుదల చేసి మా హైదరాబాద్‌ ‌ప్రజలను వోట్లు అడగండి. మా ప్రభుత్వం వరద బాధితులను ఆదుకుంది. మీకు నిజంగా చిత్త శుద్ధి ఉంటే 1000 కోట్లు వెంటనే ఇచ్చి ప్రజలను ఆదుకోండని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. రోడ్‌ ‌షో లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి ఎమ్మెల్సీ భూపాల్‌ ‌రెడ్డి, రామచంద్రాపురం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుష్ప నగేష్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply