Take a fresh look at your lifestyle.

మండుటెండల్లో చెరువులు, మత్తడ్లు దుంకుతున్నాయ్‌….

  • ఎం‌డాకాలంలో మత్తడి దూకడమంటే..చరిత్ర తిరగ రాయడమే
  • పైరవీలు, లంచాలు లేకుండా రైతుబంధు, బీమా డబ్బులు
  • కాలుకు, మెడకు పెట్టి బిజెపి రైతుల ఉసురు పోసుకుంటుంది…
  • ప్రైవేట్‌ ‌దవాఖాలను ఆశ్రయించి అనారోగ్యాలకు గురి కావొద్దు..
  • త్వరలోనే సిద్ధిపేట లైబ్రరీలో కడుపునిండా ఉచిత భోజనం
  • నిరుద్యోగులు రోడ్లపై తిరగకుండా ఉద్యోగాలకు ప్రిపేర్‌ ‌కావాలి
  • సిద్ధిపేటలో ఉచితంగా కేసీఆర్‌ ‌కోచింగ్‌ ‌కేంద్రం నిర్వహణ
  • రాఘవాపూర్‌, ‌కోదండరావుపల్లి పర్యటనలో మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, మార్చి 23(ప్రజాతంత్ర బ్యూరో) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులతో మండు టెండల్లోనూ చెరువులు, మత్తడ్లు దూకుతున్నాయని, ఎండాకాలంలో మత్తడి దూకడమంటే..చరిత్ర తిరగ రాయడమేనని అది సిఎం కేసీఆర్‌తోనే సాధ్యమైందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సిద్ధిపేట రూరల్‌ ‌మండలం రాఘవాపూర్‌లో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా కెజిబివి పాఠశాల తరగతి గదులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పైరవీలు, లంచాలు లేకుండా రైతులకు రైతుబంధు, రైతు బీమా డబ్బులు అందిస్తున్నట్లు తెలిపారు. వడ్లు కొనుగోలు చేయకుండా లేనిపోనివి చెబుతూ..కాలుకు, మెడకు పెట్టి బిజెపి పార్టీ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని కేంద్రం తీరుపై విమర్శించారు. రాఘవాపూర్‌లో మోకాలి నొప్పులకు ట్రీట్‌మెంట్‌ ‌కోసం ఆర్థోపెడిక్‌ ‌వైద్యుల బృందం గ్రామానికి వొస్తుందనీ, వారి సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే క్యాన్సర్‌ ‌స్క్రీనింగ్‌ ‌బస్సు కూడా గ్రామానికి వొస్తుందని, గ్రామ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రసవాల కోసం ప్రైవేటు దవాఖాలనులను ఆశ్రయించి అనారోగ్యాలకు గురికావొద్దన్నారు. ప్రభుత్వం నార్మల్‌ ‌డెలివరీలనే ప్రోత్సహిస్తదని, నార్మల్‌ ‌డెలివరీలతో తల్లీబిడ్డల ఆరోగ్యం బాగా ఉంటుందని అవగాహన కల్పించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఆడపిల్లలు 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థినీలకు 100 కోట్ల రూపాయల వ్యయంతో హెల్త్ అం‌డ్‌ ‌హైజనిక్‌ ‌కిట్స్ ఇవ్వాలని నిర్ణయించిందని పేర్కొన్నారు.

సిఎం కేసీఆర్‌ ‌నేతృత్వంలో అందరికీ ఇంగ్లీషు మీడియం విద్య అందించాలని, పేద పిల్లలను మంచి విద్యకై ప్రయివేటుకు పంపిస్తున్నారని, కార్పొరేట్‌ ‌దీటుగా 7వేల 300 రూపాయల కోట్ల నిధులు కేటాయించి మన ఊరు-మన బడి ప్రారంభం చేశారని తెలిపారు. అలాగే 7, 8, 9వ తరగతిల్లో ఇప్పటికే ఇంగ్లీషు మీడియం ఉండగా, ఒక్కో విద్యా సంవత్సరం ఒక్కో తరగతి ఇంగ్లీషు మీడియం తరగతులు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఇంగ్లీషు మీడియం విద్య రాబోయే తరాలకు ఎంతగానో ఉపయోగకరమని, ఇకపై ప్రయివేటు స్కూళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదని, పేద తల్లిదండ్రులకు వేల రూపాయల ఫీజులు భారం లేకుండా కార్పోరేట్‌ ‌స్థాయిలో ఇంగ్లీషు మీడియం విద్యను అందించేలా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మీరంతా పాస్‌ ‌కావాలని చదవొద్దు. ర్యాంకు రావాలని చదవాలన్నారు. సిద్ధిపేట జిల్లా, రాష్ట్ర టాపర్‌గా ఉండాలనీ, కెజిబివి విద్యార్థినీలు రాష్ట్ర స్థాయిలో టాపర్‌ ‌గా ఉండాలనీ, పోటీ పడి చదివిపైకి ఎదగాలని మంత్రి హరీష్‌రావు ఆకాంక్షించారు.

త్వరలోనే సిద్దిపేట లైబ్రరీలో చదువుకునే కడుపునిండా ఉచిత భోజనం పెడతామని, నిరుద్యోగులు రోడ్లపై తిరగకుండా ఉద్యోగాలకు ప్రిపేర్‌ ‌కావాలని కోరుతూ.. నిరుద్యోగ అభ్యర్థులు కోసం ఉచితంగా కేసీఆర్‌ ‌కోచింగ్‌ ‌కేంద్రం నిర్వహణ చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. సిఎం కేసీఆర్‌ ‌పేరిట ఉచితంగా కోచింగ్‌ ఇస్తున్నట్లు, సిద్ధిపేటలో పోటీ పరీక్షలకు, కానిస్టేబుల్‌ ‌శిక్షణకు, గ్రూపు 1, 2, 3, 4 అన్నీ రకాల ఉద్యోగాలకు పైసా ఖర్చు లేకుండా హైదరాబాద్‌ ‌నుంచి నిష్ణాతులైన అధ్యాపకులచే ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నట్లు యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీష్‌రావు కోరారు. సిద్ధిపేట జిల్లా లైబ్రరీ కేంద్రంలో ఉద్యోగాలకై చదివే యువత కై రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా భోజనం పెట్టిస్తానని భరోసాను ఇచ్చారు. ఈ యేడాది ఇంటి అడుగుజాగలో ఇళ్లు కట్టుకునేందుకు 3 లక్షల రూపాయలందిస్తామని, అలాగే ఎస్సీ, మాల సంఘం భవనంకై 10 లక్షలు, కోటి రూపాయలతో పిఏసిఎస్‌ ‌భవనం ప్రారంభం చేసినట్లు, గ్రామంలో ఏఎన్‌ఎం ‌సబ్‌ ‌సెంటరుకు 20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి హామీనిచ్చారు. నా ఊరికి నేను సేవ చేయాలని ఎంతో వ్యయప్రయసాలకులోనై ఎంపిపి శ్రీదేవి చందర్‌ ‌కృషి చేశారని కొనియాడారు. రాఘవాపూర్‌ ‌కేజీబీవీ పాఠశాలకు డ్యూయల్‌ ‌డెస్కులు కావాలని కోరగా, అందజేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, టిఆర్‌ఎస్‌ ‌నేతలు పాల్గొన్నారు.

నెలలోపు కోదండరావుపల్లికి దళితబంధు మంజూరు చేయిస్తా…
ఇచ్చిన మాట ప్రకారం వారంలో మీ గ్రామానికి వొస్తానని వొచ్చినట్లు, నెలలోపు కోదండరావుపల్లికి దళితబంధు మంజూరు చేయిస్తానని మంత్రి హరీష్‌రావు హామీనిచ్చారు. గ్రామంలోని 1530 సర్వే నెంబరులో భూ సమస్య జఠిలంగా ఉన్నదని త్వరలోనే జిల్లా కలెక్టర్‌ ‌హన్మంతరావుతో జరిగే సమావేశంలో చర్చించి సమస్య కొలిక్కి వచ్చేలా శాయశక్తులా కృషి చేస్తానని భరోసానిచ్చారు. 60 ఏళ్లలో టీడీపీ, కాంగ్రెస్‌ ‌చేయని సాగునీళ్లు, నిరంతర కరెంటు సరఫరా పనిని టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వం చేసి చూపిందని, భవిష్యత్తు తరాలకు శాశ్వతంగా గుర్తుండే పనిగా చెప్పుకొచ్చారు. నా నియోజకవర్గ రైతులు బాగుండాలన్నదే నా ప్రయత్నం. ప్రస్తుత పరిస్థితుల్లో పంట మార్పిడి అవసరం. పామాయిల్‌ ‌తోటలు సాగు చేయండి. లాభసాటిగా మారి ఒక ఎకరాకు లక్షా 50 వేలు ఆర్జించే అవకాశం అందిపుచ్చుకోవాలని రైతులకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. నారాయణరావుపేట మండలంలోని కోదండరావుపల్లిలో విలేజ్‌ ‌ఫంక్షన్‌ ‌హాల్‌, ‌పల్లె ప్రకృతి వనం, స్మశాన వాటిక, ఓపెన్‌ ‌జిమ్‌, ‌డంప్‌ ‌యార్డులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగుతో రైతులకు ఆర్థిక భరోసా కలుగుతుందని చెప్పారు. మొదటి సారి ఆయిల్‌ ‌ఫామ్‌ ‌సాగుకు రాష్ట్ర బడ్జెట్‌ ‌లో వెయ్యి కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

Leave a Reply