Take a fresh look at your lifestyle.

నేనున్నా… మీరు ధైర్యంగా ఉండండి..!

పిపిఈ కిట్టు లేకుండానే కోవిడ్‌ ‌వార్డులన్నీ కలియ తిరుగుతూ…
కొరోనా పేషెంట్లకు ఆత్మీయ పలకరింపుతో ధైర్యాన్ని, భరోసా నింపిన మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, మే 19 (ప్రజాతంత్ర బ్యూరో): ప్రభుత్వ దవాఖానల్లో కోవిడ్‌ ‌చికిత్స విధానాన్ని పరిశీలించడానికి, కొరోనా పేషెంట్లకు భరోసానిచ్చేందుకుగానూ స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు  సిద్ధిపేటలోని  ప్రభుత్వ  జనరల్‌ ‌దవాఖానను సందర్శించారు.
బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ ‌పరపతి వెంకట్రామరెడ్డి కలిసి  స్థానిక ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న మంత్రి హరీష్‌రావు కోవిడ్‌ ‌వార్డుల్లో  పేషెంట్లున్న వార్డును కలియతిరిగారు. ఎలాంటి పిపిఈ కిట్టు లేకుండా కోవిడ్‌ ‌వార్డులన్నింటినీ తిరిగారు. కోవిడ్‌ ‌పేషెంట్ల బాగోగులను, వైద్యం సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. పేషెంట్లతో మాట్లాడారు.  అన్నం పెడుతున్నారా.. వసతులు ఎలా ఉన్నాయ్‌.. ‌మంచిగా చూసుకుంటున్నారా? అని  కోవిడ్‌ ‌పేషంట్స్‌తో ఆత్మీయంగా మంత్రి మాట్లాడారు. వారి యోగ క్షేమాలను తెలుసకున్నారు.  మీకు ఏం కాదు.. నేను ఉన్నా ధైర్యంగా ఉండండంటూ మంత్రి హరీష్‌రావు మనోధైర్యం నింపడమే కాకుండా, మీకు నేనున్నాననే భరోసాను, ధైర్యానిచ్చారు.ఇంటెన్సివ్‌ ‌కేర్‌ ‌యూనిట్‌లో చికిత్స పొందుతున్న 20 మంది కోవిడ్‌ ‌పేషెంట్ల బాగోగులను, వైద్యం, భోజన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. నేను కూడా కొరోనా బారినపడి కోలుకున్నాను. మీరందరూ ధైర్యంగా ఉండండి…. మీరు కూడా కొరోనాను జయిస్తారన్నారు.
హాస్పిటల్‌లోపల, హాస్పిటల్‌పరిసరాలను నిరంతరం క్లీనింగ్‌ ‌చేసేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.  అలాగే, ఇప్పుడున్న పరిస్థితుల్లో పేషెంట్లకు వైద్యాధికారులు, డాక్టర్లు, నర్సులు, సిబ్బంది సేవలను మంత్రి హరీష్‌రావు ప్రశంసించారు.  కోవిడ్‌ ‌కష్టకాలంలో వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు గొప్పవని మంత్రి హరీష్‌రావు అన్నారు. సాదా సీదాగా..ఆత్మీయ పలకరింపుతో కొరోనా పేషేంట్లతో మాట ముచ్చటతో వారందరిలోనూ కొండంత బలం, ధైర్యాన్ని నింపారు. అంతేకాకుండా, నాకు కూడా కొరోనా వచ్చి కోలుకున్నాను. మీరు కూడా కోలుకుంటారంటూ… అంటూ ఆత్మీయ భరోసా కల్పించారు. కొరోనా అంటేనే  భయ పడే సమయంలో కొరోనా పేషంట్స్  ఉం‌టున్న వార్డులు, బెడ్‌ ‌దగ్గరికి వెళ్లి  మంత్రి పలకరించడం అంత అషామాషీ విషయమేమీ కాదు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం కొరోనా అనే పదం వింటేనే ఆమడ దూరం పోతున్నాం. కొరోనా విలయతాండం చేస్తున్న ప్రభుత్వ హాస్పిటల్‌ల్లో పరిస్థితులు చాలా ఘోరం అనే పదం వింటున్నాం కూడా. అయితే, ప్రభుత్వం…ప్రభుత్వ హాస్పిటల్‌అం‌టే ఒక నమ్మకం…ఒక విశ్వాసం అని నిరూపించడానికి కొరోనా  అనే మహమ్మారిని తరిమికొట్టే ధైర్యాన్ని  బుధవారం సాయంత్రం సిద్ధిపేటలోని జనరల్‌ ‌దవాఖానలో ఉన్న కొరోనా బారినపడిన బాధితుల వార్డుల్లో బెడ్‌ ‌బెడ్‌ ‌కలియ తిరిగి వారికి మనోధైర్యం నింపిన గొప్ప ప్రజాప్రతినిధి, గొప్ప పాలనాధికారి  అని మరోసారి నిదర్శనం అని చూపారు మంత్రి హరీష్‌రావుకు, జిల్లా కలెక్టర్‌ ‌పరపతి వెంకట్రామరెడ్డి

Leave a Reply