Take a fresh look at your lifestyle.

శాశ్వత పరిష్కారం చూపిస్తా..

మల్లారంలో నీట మునిగిన వాటర్‌ ‌ట్రీట్‌ ‌మెంట్‌ ‌ప్లాంటును పరిశీలించిన మంత్రి హరీష్‌ ‌రావు

మల్లారం గ్రామంలోని హైదరాబాద్‌ ‌మెట్రో పాలిటన్‌ ‌వాటర్‌ ‌సప్లై సివరేజి బోర్డ్ ‌వాటర్‌ ‌ట్రీట్‌ ‌మెంట్‌ ‌ప్లాంట్‌లో నీట మునిగిన పంప్‌ ‌హౌజ్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు పరిశీలించారు. సోమవారం వేకువ జామున మునుపెన్నడూ లేని విధంగా సిద్దిపేట జిల్లాలో 4 గంటల్లో 13 సెంటీ మీటర్ల వర్షపాతం కురిసింది. కుండపోత వర్షంతో ఉధృతమైన వరద నీరు రావడంతో చిన్న కోడూరు మండలం మల్లారం గ్రామంలోని హైదరాబాద్‌ ‌మెట్రో పాలిటన్‌ ‌వాటర్‌ ‌సప్లై సివరేజి బోర్డ్ ‌వాటర్‌ ‌ట్రీట్‌ ‌మెంట్‌ ‌ప్లాంట్‌ ‌లోని 6.6కేవీ పంప్‌ ‌హౌజ్‌ ‌నీట మునిగింది. పంప్‌ ‌హౌజ్‌ ‌నీట మునకతో హైదరాబాద్‌ ‌డ్రింకింగ్‌ ‌వాటర్‌తో పాటు సిద్దిపేట, జనగాం, భువనగిరి, మేడ్చల్‌ ‌పరిధిలోని 1950 హబిటేషన్‌ ‌లకు త్రాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. హైదరాబాద్‌ ‌మెట్రో పాలిటన్‌ ‌వాటర్‌ ‌సప్లై సివరేజి బోర్డ్ ఎం‌డీ దాన కిషోర్‌ ‌నేతృత్వంలో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నామని ఈ సందర్భంగా హరీష్‌ ‌రావు తెలిపారు. 1 నుంచి 2 రోజుల్లో తాత్కాలిక ప్రాతిపదికన రిస్టోరేషన్‌ ‌చర్యలు చేపడతామన్నారు.

2 నుంచి 3 రోజుల్లో శాశ్వత ప్రాతిపదికన రిస్టోరేషన్‌ ‌చర్యలు చేపడతామన్నారు. 2నుంచి 3 రోజుల్లో పూర్తి స్థాయిలో త్రాగునీటి పంపింగ్‌ ‌చేపడుతామనీ, సీఎం కేసిఆర్‌ ‌దూర దృష్టితో రింగ్‌ ‌మెయిన్‌ ఏర్పాటు చేయడం వల్ల హైదరాబాద్‌ ‌డ్రింకింగ్‌ ‌వాటర్‌ ‌సరఫరా అంతరాయం లేకుండా చూస్తున్నామన్నారు. పంప్‌ ‌హౌజ్‌ ‌నీట మునకతో మల్లారం ట్రీట్‌ ‌మెంట్‌ ‌ప్లాంట్‌ ‌ద్వారా త్రాగునీటి సరఫరాలో ఎదురయ్యే తాత్కాలిక అడ్డంకులను అధిగమించేందుకు హిమాయత్‌ ‌సాగర్‌, ‌గండి పేట, ఉస్మాన్‌ ‌సాగర్‌, ‌సింగూరు నుంచి హైదారాబాద్‌ ‌కు త్రాగునీటి సరఫరా పెంచుతాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపడుతామనీ మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు.

Leave a Reply