Take a fresh look at your lifestyle.

శ్రావణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను ప్రారంభించిన మంత్రి హరీశ్‌ ‌రావు

ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 06 : ‌మహిళలు, పిల్లల కోసం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి శ్రావణి హాస్పి టల్స్‌ను మాదా పూర్‌లో  తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. 75 పడకల హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సాంకేతికత, సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం అంకితమైన అత్యంత అర్హత కలిగిన వైద్యుల బృందం చేత హాస్పిటల్‌ ఏర్పాటు చేయడం అభినంద నీయం అని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. ఫిలిప్స్ ‌మానిటర్స్, 4 ‌కె అడ్వాన్స్‌డ్‌ ‌లాపరోస్కోపీ, కార్ల్ ‌స్టోర్జ్, 32 ‌స్లైస్‌ ‌సిమెన్స్ ‌సిటీ స్కాన్‌, ఒలింపస్‌ ఎం‌డోస్కోపీ వంటి అధునాతన పరికరాలను కలిగి ఉందని శ్రావణి హాస్పిటల్స్ ‌సిఇఒ శ్రావణి చెట్టుపల్లి అన్నారు. పీడియాట్రిక్స్, ‌ప్రసూతి శాస్త్రం, గైనకాలజీ వంటి ప్రత్యేక విభాగాలలో చికిత్స అందించడమే కాకుండా, ఇది జనరల్‌ ‌మెడిసిన్‌, ఈఎన్టి సేవలను కూడా అందిస్తుందన్నారు.

పల్మోనాలజీ, కార్డియాలజీ, వివిధ క్రిటికల్‌ ‌కేర్‌, ‌సర్జరీలు. హాస్పిటల్లో అత్యాధునిక రేడియాలజీ, ఫార్మసీ, పాథాలజీ, ఫలహారశాల, అంబులెన్స్ ‌సేవలు కూడా ఉన్నాయన్నారు. వైద్యం  శ్రద్ధ అవసరమైన ప్రజలకు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో సేవ చేయడమే మిషన్‌ అని అన్నారు. మహిళలు, పిల్లల సంరక్షణలో భిన్నత్వంతో విప్లవాత్మక మార్పు తీసుకురావడమే లక్ష్యం అన్నారు. రోగులకు అత్యుత్తమ చికిత్స అందేలా తాము వారి సంబంధిత రంగాలలో గొప్ప అనుభవం ఉన్న నిపుణులను ఒకే పైకప్పు క్రిందకు తీసుకు వచ్చామన్నారు. ‘హెల్త్ ‌ఫస్ట్’ అనే విధానంతో మహిళలు, పిల్లలకు మెరుగైన ఆరోగ్యం పట్ల నిబద్ధత శ్రావణి హాస్పిటల్స్ ‌సేవలలో ప్రధానమైనదని అన్నారు. అధునాతన, అధిక-నాణ్యత సేవలతో ఇది మంచి ఆరోగ్యానికి గమ్యస్థానంగా ఉద••వించిందన్నారు.

అనంతరం శ్రావణి హాస్పిటల్స్ ‌మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌డాక్టర్‌ ‌నవీన్‌ ‌చెట్టుపల్లి మాట్లాడుతూ శిక్షణ పొందిన  అత్యంత అనుభవజ్ఞులైన పేషెంట్‌ ‌కేర్‌ ‌ప్రొవైడర్లు, నర్సింగ్‌ ‌సిబ్బందిచే తగిన శ్రద్ధతో 24 గంటల సంరక్షణ ఉంటుందన్నారు. ప్రారంభోత్సవం సందర్బంగా చెట్టుపల్లి ఫౌండేషన్‌తో కలిసి ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహించిందన్నారు. ఆయుష్మాన్‌ ‌భవన్‌ ‌స్కీం కింద వెయ్యి హెల్త్ ‌కార్డులను, వెయ్యి ఫస్ట్ ఎయిడ్‌ ‌కిట్‌ ‌లను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు.

శ్రావణి హాస్పిటల్స్‌లోని సీనియర్‌ ‌వైద్యుల ప్యానెల్‌లో సర్జికల్‌ ‌గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ‌డాక్టర్‌ ‌ప్రసాద్‌ ‌నీలం, సీనియర్‌ అబ్స్ ‌స్టెట్రిషియన్‌, ‌గైనకాలజిస్ట్ ‌డాక్టర్‌ అశ్విని అన్నం, సీనియర్‌ ‌కన్సల్టెంట్‌-ఇం‌టర్నల్‌ ‌మెడిసిన్‌ ‌డాక్టర్‌ ‌శ్రీనివాసులు తలచెరు, జనరల్‌ ‌సర్జన్‌, ‌కోలోప్రోక్టాలజిస్ట్ ‌డాక్టర్‌ ‌సుష్మా పేరూరి అన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు అరెకెపూడి గాంధీ, కృషా?రావు, కార్పొరేటర్‌ ‌జగదీశ్వర్‌ ‌గౌడ్‌, ‌డాక్టర్‌ ‌పద్మశ్రీ మంజుల అనగాని, డాక్టర్‌ ‌జి.సతీష్‌ ‌రెడ్డి, భాస్కర్‌ ‌రావు(కిమ్స్ ‌మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌), ‌టీఎస్‌టీఎస్‌ ‌చైర్మన్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌పాటిమీడి హాజరయ్యారు.

Leave a Reply