Take a fresh look at your lifestyle.

మంత్రి హరీష్‌రావు కృషితో… కార్పొరేట్‌ ‌వైద్య సేవలకు నిలయంగా సిద్ధిపేట సర్కార్‌ ‌దవాఖాన

  • మొన్న డయాగ్నోస్టిక్‌ ‌సెంటర్‌… ‌నేడు సిటీ స్కాన్‌
  • ‌సిద్ధిపేట పేద ప్రజల చెంతకు ఖరీదైన రోగనిర్ధారణ పరీక్షలు
  • పైసా లేకుండా పేదలకు అత్యాధునిక సిటీ స్కాన్‌ ‌సేవలు
  • రూ.2.15కోట్లతో సిటీ స్కాన్‌
  • ‌రూ.2.40కోట్లతో 20పడక ఐసియూ వార్డు
  • నేడు మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా ప్రారంభం

సిద్ధిపేట, మార్చి 20 (ప్రజాతంత్ర బ్యూరో): వారెవ్వా ఆసుపత్రి అదిరింది… కార్పొరేట్‌ను మించిన వసతులు..అత్యాధునిక పరికరాలు.. ఆపరేషన్‌ ‌థియేటర్లు.. విశాలమైన గదులు..పరిశుభ్రమైన వాతావరణం…కార్పొరేట్‌ ఆసుపత్రులు కూడా ఈ సర్కారీ దవాఖానా కింద పనికిరావు..ఎందుకంటే అలాంటి వసతులు కల్పించారు ఈ హాస్పిటల్‌లో. హై ఫై వసతులతో అదరగొట్టారు.  జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని సర్కార్‌ ‌దవాఖానలను స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు  బలోపేతం చేస్తున్నారు. సర్కార్‌ ‌దవాఖానలను ప్రయివేట్‌ ‌కార్పొరేట్‌ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా మారుస్తున్నారు.

పేద ప్రజలకు ఖరీదైన రోగ నిర్ధారణ పరీక్షలను అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పటికే సిద్ధిపేట సర్కార్‌ ‌దవాఖానలో డయాగ్నోస్టిక్‌ ‌సెంటర్‌ ‌సేవలను అందుబాటులోకి తెచ్చిన మంత్రి హరీష్‌రావు తాజాగా..పేదలకు పైసా  ఖర్చు లేకుండా అత్యాధునిక సిటీ స్కాన్‌ ‌సేవలను మరికొన్ని గంటల్లో అందుబాటులోకి తేనున్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అతి భారమైనవి వైద్యఖర్చులే. ఏ చిన్న ఆరోగ్య సమస్యతో ఏ ప్రయివేట్‌ ‌వైద్యుడి వద్దకు వెళ్లినా వెంటనే వైద్యుడు సిఫారసు చేసేది మొదట వైద్యపరీక్షలకే. కొన్ని సార్లయితే ఒకటికి మించి రోగ నిర్దారణ పరీక్షలు చేసుకోవాల్సి వస్తుంది.

siddipet

వైద్య పరీక్షలలో వచ్చిన ఫలితాల ఆధారంగానే వైద్య సేవలు అందిస్తుంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న రోగ నిర్దారణ పరీక్షలు  పేద , మధ్య తరగతి ప్రజలకు భారంగా పరిణమిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వైద్యం కంటే వ్యాధి నిర్ధారణ పరీక్షలకే అధికంగా వెచ్చించాల్సి వస్తోంది. దీంతో పేద ప్రజలు తమ స్థాయికి మించి ఖర్చు చేసి అప్పుల పాలవుతున్నారు. మరి కొంత మంది పేదలైతే ఖరీదైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకోలేక ప్రాణం కోల్పోతున్న ఘటనలు అనేకం చూస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు నిరుపేదలపై ఆర్థికభారం తగ్గించే క్రమంలోనే మంత్రి  హరీష్‌ ‌రావు సిద్దిపేటలో ఖరీదైన అత్యాధునిక రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భావించారు.ఈ క్రమంలో  రూ.2 కోట్ల 15 లక్షల రూపాయలతో సిటీ స్కాన్‌ ‌సేవలు సిద్దిపేట ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సిటీ స్కాన్‌ను మంత్రి హరీష్‌రావు ఆదివారం ప్రారంభించనున్నారు.

Leave a Reply