Take a fresh look at your lifestyle.

ఐదేండ్లలోనే గిరిక తాటి కల్లు చక్కెర వ్యాధి గ్రస్తులూ సేవించొచ్చు…

  • ప్రయోజనాలను గీత కార్మికులకందించేందుకే మొక్కలు ఉచితంగా అందిస్తున్నాం
  • త్వరలో సిద్ధిపేటలో నీరా సెంటర్‌
  • ‌గిరిక తాటి మొక్కల పంపిణీలో మంత్రి హరీష్‌రావు

గిరిక తాటి చెట్ల ప్రయోజనాలను గీత కార్మికులకు అందించేదుకే ఉచితంగా అందిస్తున్నామనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. సిద్దిపేట పట్టణం సమీపంలోని తేజోవనంలో బుధవారం సిద్దిపేట నియోజకవర్గ గౌడ కమ్యూనిటీ ప్రజలకు గిరిక తాటి మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరై గీత కార్మికులకు 2530 గిరిక తాటి మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…గిరిక తాటి చెట్ల వల్ల గీత కార్మికులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అందుకే రెండు సంవత్సరాల క్రితం 4 వేల మొక్కలను పంపిణీ చేశామన్నారు. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలియక వాటి పెంపకంపై కొందరూ గీత కార్మికులు నిర్లక్ష్యం చేశారని అన్నారు. సంప్రదాయ తాటి చెట్ల నుండి కల్లు తీయాలంటే 10-12 సంవత్సరాలు వేచి చూడల్సి రాగా గిరిక తాళ్ల నుంచి 5 సంవత్సరాలకే కల్లు గీత కు వస్తాయన్నారు. తాటి చెట్ల నుండి రోజుకు 5-10 సీసాల కల్లు రాగా, గిరిక తాళ్ల నుండి 40-100 సీసాల కల్లు వస్తుందన్నారు. సంవత్సరంలో వర్షాకాలం మినహా 8 నెలలు నిరంతరయంగా కల్లు వస్తుందన్నారు. చక్కెర వ్యాధి గ్రస్తులు కూడా గిరిక తాటి కల్లు సేవించవచ్చన్నారు. వీటి ఎత్తు కూడ గరిష్ఠంగా 7 మీటర్ల వరకే ఉంటుందన్నారు. ఒక్క గిరిక తాటి చెట్టు 10 సంప్రదాయ తాటి చెట్లకు సరిసమానమని మంత్రి స్పష్టం చేశారు. ఇలా తాటి చెట్టుతో పోల్చుకుంటే గిరిక తాళ్లు అన్ని విధాలుగా గీత కార్మికులకు ప్రయోజనకరంగా ఉన్నందునే మొక్కలను ఉంచితంగా గీత కార్మికులకు అందించి వాటి పెంపకంను ప్రోత్సాహిస్తున్నామని మంత్రి తెలిపారు. మంచి ఉద్దేశ్యంతో గీత కార్మికుల ఆర్థిక పరిపుష్టికి గిరిక తాటి మొక్కలను అందిస్తున్న అంకుషాపురం, గుర్రాలగొంది, చిన్నగుండవెల్లి మినహా మిగతా గ్రామాల్లో మొక్కల సంరక్షణ ఆశించిన మేర లేదన్నారు. ఇక ముందు మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించే వారికే తిరిగి మరిన్ని మొక్కలను అందిస్తామని మంత్రి తెలిపారు. త్వరలోనే గజ్వేల్‌, ‌దుబ్బాక, హుస్నాబాద్‌ ‌నియోజవర్గాలలోని గీత కార్మికులకు గిరిక తాళ్ల మొక్కలు పంపిణీ చేస్తామన్నారు. క్షేత్ర స్థాయిలో మొక్కల సంరక్షణ తీరును పర్యవేక్షించేందుకు ప్రతి 4 గ్రామాలకు ఒక్క అబ్కారీ కానిస్టేబుల్‌ను నియమించి ప్రతి నెలా 1న రిపోర్ట్ అం‌దించాలని మంత్రి అబ్కారీ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే కల్లు పరిశ్రమపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. గీత కార్మికులకు పాలిట పెనుభారంగా ఉన్న చెట్ల పన్నుతో సహా అన్ని రకాల పన్నులను ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన గీత వృత్తిదారులకుహొరూ.5లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. అధికారుల వేధింపులు లేకుండా చూసిందన్నారు. హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా పెట్టిన మాదిరి సిద్దిపేట పట్టణంలో నీరా సెంటర్‌ ‌పెట్టాల్సిందిగా గీత కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారనీ… రాష్ట్ర ఎక్సైజ్‌ ‌మంత్రితో మాట్లాడి వీలైనంత త్వరగా నీరా సెంటర్‌ ఏర్పాటు చేస్తామని అన్నారు. గౌడ కమ్యూనిటీ ప్రజల విజ్ఞప్తి మేరకు సిద్దిపేట పట్టణంలో రూ.2 కోట్ల 50 లక్షల రూపాయలతో ఏసి ఫంక్షన్‌ ‌హాల్‌ ‌నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ డబ్బులు సరిపోవడం లేదని తన దృష్టికి గీత కార్మికులు తెచ్చారని అదనంగా అవసరమయ్యే డబ్బులను కూడా ఇచ్చి వచ్చే 5 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్‌, ‌రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ‌పరపతి వెంకట్రామరెడ్డి, ఆర్డీవో అనంతరెడ్డి, మునిసిపల్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌మంజుల రాజనర్సు, సుడా ఛైర్మన్‌ ‌మారెడ్డి రవీందర్‌రెడ్డి, ఎక్సైజ్‌ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గౌడ కమ్యూనిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం..త్వరలో స్వంత జాగాల్లో ఇండ్ల నిర్మాణంకు ఆర్థిక సహాయం : మంత్రి హరీష్‌రావు

Minister Harish Rao in the distribution of Girika palm plants

Community-verified icon

పేద ప్రజల కోసం ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తూ ముందుకు సాగుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు స్పష్టం చేశారు. బుధవారం సిద్దిపేట కొండ భూదేవి గార్డెన్‌లో లబ్దిదారులకు మంత్రి హరీష్‌రావు కొత్తగా మంజూరైన ఆహార భద్రత కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కార్యక్రమంకు హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ…ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదన్న లక్ష్యంతోనే ఇచ్చిన హామీ మేరకు సంతృప్త స్థాయిలో రేషన్‌ ‌కార్డులు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. కొత్తగా పెళ్లయి కుటుంబంలో భాగస్వామ్యం అయిన మహిళలు, చిన్నపిల్లలు పేర్లను రేషన్‌ ‌కార్డులలో చేర్పుల విషయం సిఎం దృష్టికి తీసుకెళతామని మంత్రి అన్నారు. తద్వారా 20 వేల మంది వరకు లబ్ది జరుగుతుందన్నారు. పేదింటి బిడ్డల పెళ్లిలకు ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ నే అని మంత్రి అన్నారు. త్వరలోనే స్వంత జాగాలో ఇండ్ల నిర్మాణం చేసుకునే అవకాశం ఇస్తామన్నారు. ప్రజల సహకారంతో సిద్దిపేట నియోజవర్గం లో పాఠశాలలు, ఆసుపత్రులను బలోపేతం, అభివృద్ధి చేసుకున్నామని మంత్రి తెలిపారు. ప్రజారోగ్యం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి తెలిపారు. స్వచ్చబడి పేరుతో ప్రజలకు పారిశుద్ధ్యం , వ్యర్థాల సమర్థ నిర్వహణపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ దవాఖానలో లో ఉచితంగా 57 రకాల ఆరోగ్య పరీక్షలు, స్కానింగ్‌ ‌సేవలు పేద ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రజా భాగస్వామ్యం ఉంటేనే స్వచ్ఛ , ఆరోగ్య, ప్లాస్టిక్‌ ‌రహిత సిద్దిపేట స్వప్నం సాకారం అవుతుందన్నారు. ఇందుకోసం అందరూ ప్రజలు స్వచ్ఛంద సహకారం అందించాలనీ మంత్రి హరీష్‌రావు కోరారు. పర్యావరణ హితంగా ప్లాస్టిక్‌కు వాడకం లేకుండా ఫంక్షన్లు నిర్వహిస్తే ఇక నుంచి తాను అలాంటి ఫంక్షన్లకు హాజరవుతానని మంత్రి అన్నారు. ప్రజలు కూడా ప్లాస్టిక్‌ ‌వాడకం వల్ల క్యాన్సర్‌ ‌మహమ్మారి బారిన పడే అవకాశం ఉన్నందున తమ వంతు బాధ్యతగా దైనందిన జీవితంలో దూరంగా ఉండాలన్నారు. ప్లాస్టిక్‌ ‌కు ప్రత్యామ్నాయంగా బట్ట సంచులు, స్టీల్‌ ‌డబ్బాలను వాడాలన్నారు. జిల్లా కలెక్టర్‌ ‌పరపతి వెంకట్రామ రెడ్డి మాట్లాడుతూ….సిద్దిపేట జిల్లాలో మొత్తం 5885 కుటుంబాలకు రేషన్‌ ‌కార్డులు కొత్తగా రేషన్‌ ‌కార్డులు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. తెలంగాణ లోని ప్రతి దారిద్య్ర రేఖకు దిగువనున్న ప్రతి వ్యక్తికి ప్రభుత్వం ఆహార భద్రత ఇస్తుందన్నారు. రాష్ట్రంలో 92 శాతం మంది ఆహార భద్రత క్రింద రేషన్‌ ‌బియ్యం ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. మనిషికి ఆరు కిలోల బియ్యం ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణేననీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్‌, ‌రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ‌పరపతి వెంకట్రామరెడ్డి, ఆర్డీవో అనంతరెడ్డి, మునిసిపల్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌మంజుల రాజనర్సు, సుడా ఛైర్మన్‌ ‌మారెడ్డి రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply