Take a fresh look at your lifestyle.

సామాన్యుల నడ్డి విరుస్తున్న బిజెపి కేంద్ర ప్రభుత్వం  

  • బిజెపి గెలిస్తే పెట్రో ధరలు కరెంట్‌ ‌మీటర్లలా తిరుగుతయ్‌
  • అక్కచెల్లెళ్లు ఆలోచించి ఓటేయండి
  • ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్‌ ‌రావు
  • కాంగ్రెస్‌కు డిపాజిట్‌ ‌రాదన్న కౌశిక్‌ ‌రెడ్డి

భాజపా హయాంలో పెట్రోలు, డీజిల్‌, ‌గ్యాస్‌ ‌ధరలు భారీగా పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని హరీష్‌ ‌రావు మండిపడ్డారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది. అధికార తెరాస తరఫున మంత్రులు, ఇతర నేతలు రంగంలోకి దిగుతున్నారు. ప్రచారాన్ని ముమ్మరం చేసిన మంత్రి హరీష్‌ ‌రావు లక్ష్మాజీపల్లిలో మాట్లాడుతూ భాజపాపై విమర్శలు గుప్పించారు. ‘ఈటల రాజేందర్‌ ఆరుసార్లు గెలిచారు..ఆయనకు వ్యాపారం కూడా ఉంది. ఇక్కడ పదిహేడేళ్లు అధికారంలో ఉన్నా ఈటల ఏవి• చేయలేదు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు రెండేళ్లు అవకాశం ఇవ్వండి. పని చేయించి చూపిస్తా. భాజపా గెలిస్తే పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌గ్యాస్‌ ‌ధరలు కరెంటు వి•టర్లు తిరిగినట్టు తిరుగుతాయ్‌.

అలా పెరగాలా..? తెరాస గెలిచి పేద ప్రజల సంక్షేమం కొనసాగాలా? ఆలోచించి వోటేయండి. ఈ నెల 30న వోటేసేందుకు పోయేటప్పుడు అక్కాచెల్లెళ్లు ఒక్కసారి వంటగదిలోకి పోయి సిలిండర్‌కు దండం పెట్టి వెళ్లండి. యువత కష్ట పడి పనిచేయాలి.. భవిష్యత్తు మనదే‘ అని హరీష్‌ ‌రావు వ్యాఖ్యానించారు. ఇక పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ‌కోవర్ట్ అని టీఆర్‌ఎస్‌ ‌నేత పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ ‌పార్టీని రేవంత్‌రెడ్డి నాశనం చేస్తున్నారన్నారు. హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్‌ ‌కూడా రాదని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్‌కు డిపాజిట్‌ ‌వొస్తే..రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ ‌విసిరారు. హుజురాబాద్‌ ‌గురించి కాంగ్రెస్‌ అభ్యర్థికి ఏం తెలుసని పాడి కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. హుజురాబాద్‌ ‌కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ ‌నామినేషన్‌ ‌కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన వి•డియాతో మాట్లాడుతూ కౌశిక్‌రెడ్డిపై రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్‌ ‌టీఆర్‌ఎస్‌ ‌నాయకుడు కౌశిక్‌రెడ్డిపై రేవంత్‌రెడ్డి పరోక్షంగా మండిపడ్డారు.

Leave a Reply