Take a fresh look at your lifestyle.

కేంద్రం సంచలన నిర్ణయం… ఐజీఎస్టీ కమిటీలో మంత్రి హరీష్‌రావుకు కీలక పదవీ

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, సిద్ధిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్‌రావుకు కీలక పదవీ ఇచ్చింది. ఐజీఎస్టీ పరిష్కారం కోసం కేంద్రం ఏడుగురు మంత్రుల బృందంతో కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. ఐజీఎస్టీ పరిష్కారం, సంబంధిత అంశాలపై 2019 డిసెంబర్‌లో ఈ కమిటీ ఏర్పాటైంది. అయితే ఈ కొత్త కమిటీలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌రావుకు కేంద్రం చోటు కల్పించింది.  ఐజీఎస్టీ సెటిల్‌మెంట్‌ ‌కమిటీలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావును సభ్యుడిగా చోటు కల్పించింది. ఈ మేరకు జీఎస్టీ కౌన్సెల్‌ ‌సెక్రటరీ ఎస్‌.‌మహేశ్‌ ‌కుమార్‌ ‌కొత్త కమిటీని ప్రకటించారు.ఈ కమిటీకి కన్వీనర్‌గా బీహార్‌ ఆర్థికమంత్రి సుశీల్‌కుమార్‌ ‌మోదీ నియమితులయ్యారు.

సభ్యులుగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ ‌సిసోడియా, ఛత్తీస్‌ఘఢ్‌, ఒడిసా, పంజాబ్‌, ‌తమిళనాడు మంత్రులు టీస్‌ ‌సింగ్‌, ‌నిరంజన్‌ ‌పుజారి, మన్‌‌ప్రీత్‌ ‌సింగ్‌ ‌బాదల్‌, ‌జయకుమార్‌ను నియమించారు.ఈ కమిటీ ఐజీఎస్టీలో వచ్చే సమస్యలను పరిష్కరించడం, సంబంధిత అంశాలపై పని చేయనుంది. గతంలో కేంద్ర, రాష్ట్రాల పన్ను అధికారులు, వాణిజ్య, పారిశ్రామిక రంగాల ప్రతినిధులు, జీఎస్టీ ఇతర భాగస్వాములకు ఈ కమిటీలో స్థానం కల్పించేవారు. కానీ, కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా రాష్ట్రానికి చెందిన ఆర్థిక మంత్రి తన్నీరు హరీస్‌రావును సభ్యుడిగా చోటు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే, ఐజీఎస్టీ కింద రాష్ట్రానికి సుమారు రూ.2,800 కోట్లు రావాల్సి ఉంది. ఐజీఎస్టీ సెటిల్‌మెంట్‌ ‌కమిటీలో మంత్రి హరీష్‌రావును సభ్యుడిగా నియమించడంతో, ఆ నిధులను రాబట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

Leave a Reply