Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌లో కూర్చోని మాట్లాడటం కాదూ…: మంత్రి హరీష్‌రావు

  • గ్రామాల్లోకి వచ్చి చూస్తే అభివృద్ధి కనబడుతది
  • కాంగ్రెస్‌, ‌బిజెపి నేతలపై మండిపడ్డ మంత్రి హరీష్‌రావు
  • మరో రెండు నెలల్లో మల్లన్నసాగర్‌ ‌నీళ్లు
  • సిఎం కేసీఆర్‌తో దశ, దిశ మారాయి
  • అహ్మదీపూర్‌ ‌సభలో మంత్రి హరీష్‌రావు

కాంగ్రెస్‌, ‌భారతీయ జనతా పార్టీ నేతలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తనదైనశైలిలో మండిపడ్డారు. కాంగ్రెస్‌, ‌బిజెపి నేతలు హైదరాబాద్‌లో కూర్చోని మాట్లాడటం కాదూ…గ్రామాల్లోకి వచ్చే చూస్తే మేము చేస్తున్న అభివృద్ధి కాంగ్రెస్‌, ‌బిజెపి నేతల ముఖాలకు కనబడుతుందన్నారు. సోమవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ ‌మండలం అహ్మదీపూర్‌లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌గృహా ప్రవేశాలు చేయించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ… ఎన్నడూ లేని విధంగా అహ్మదీపూర్‌లో రూ.6.25 కోట్ల రూపాయల నిధులతో కూడిన 14 రకాల అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నామనీ, తెలంగాణ రావడం కేసీఆర్‌ ‌సిఎం కావడంతో అహ్మదీపూర్‌ ‌దశ దిశ మారిపోయిందన్నారు.

కాంగ్రెస్‌ ‌హయాంలో కాలిపోయిన మోటర్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మార్లు ఉండేవనీ, ఇప్పుడు కేసీఆర్‌ ‌హయాంలో కాళేశ్వరం నీళ్లతో నిండు కుండలా తెలంగాణ తయారైందన్నారు. మండుతున్న ఎండల్లో కాళేశ్వరం నీళ్లను తీసుకొచ్చి కొత్త నడక నేర్పిన ఘనత కేసీఆర్‌దన్నారు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ హయాంలో తెలంగాణ రైతాంగానికి కేసీఆర్‌ అనే భరోసా లభించిందనీ, కరెంట్‌ ‌లేకుండా కాలువల నీటి ద్వారా పొలాలను పండించుకునే సమయం ఆసన్నమైందన్నారు. వచ్చే నెల నుంచి 57 వయస్సు దాటినా అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్‌ ఇస్తామన్నారు. మరో రెండు నెలల్లో మల్లన్నసాగర్‌లో నీళ్లు వచ్చి చేరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌వేలేటి రోజారాధాక్రిష్ణశర్మ, అదనపు కలెక్టర్‌ ‌ముజమ్మీల్‌ఖాన్‌, ‌గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఎంపిపి దాసరి అమరావతి, ఏఎంసి ఛైర్మన్‌ ‌మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్‌ ‌నేతలు పాల్గొన్నారు.

96 మంది లబ్ధిదారులకు సిఎంఆర్‌ఎఫ్‌ ‌చెక్కుల అందజేత
సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ ఐఓసీలోని గడా కాన్ఫరెన్స్ ‌హాల్‌లో నియోజకవర్గ పరిధిలోని 96 మంది లబ్ధిదారులకు రూ.44 లక్షల 71 వేల 900 రూపాయల మేర సిఎంఆర్‌ఎఫ్‌ ‌చెక్కులను మంత్రి హరీష్‌రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలు సాయం.. పొందేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తున్నదని చెప్పడానికి గజ్వేల్‌ ‌నియోజకవర్గమే నిదర్శనమని మంత్రి చెప్పారు. చెక్కులను వెంటనే తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ మేరకు గజ్వేల్‌ 52, ‌వర్గల్‌ 29, ‌మర్కుక్‌ 6, ‌తూఫ్రాన్‌ 9 ‌చొప్పున 96 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు.

సిఎం ఆశీస్సులతో ఆర్‌ఎం‌పి, పిఎంపిలకు ఆత్మగౌరవ భవనం
గజ్వేల్‌లో ఆర్‌ఎం‌పి, పిఎంపి అసోసియేషన్‌ ‌భవన నిర్మాణం పనులకు సోమవారం మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిఎం కేసీఆర్‌ ఆశీస్సులతో ఆర్‌ఎం‌పి, పిఎంపి అసోసియేషన్‌ ఆత్మ గౌరవ భవనానికి పునాది రాయి వేసుకున్నామని తెలిపారు. త్వరలోనే రాష్ట్ర అసోసియేషన్‌ ‌సభ్యులను పిలిపించి మీ సమస్యలు తెలుసుకుని, సిఎం కేసీఆర్‌ ‌దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గం చూపుతానని భరోసా ఇచ్చారు.

Leave a Reply