Take a fresh look at your lifestyle.

అనాధ బిడ్డకు అండగా… ఆటో కార్మికుని కుటుంబానికి అన్నగా..

  • నాడు అనాధ బాలికను చదివించి..పెద్ద చేసి పెండ్లి చేశాడు..
  • నేడు డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇల్లు ఇప్పించాడు..
  • ఇల్లును తాకట్టు పెట్టి ఆటో కార్మికులకు లోన్‌…
  • ‌నేడు తొలి ఇన్సూరెన్స్ ‌చెక్కును అందించాడు..
  • పుట్టినరోజు సందర్భంగా మానవత్వం చాటుకున్న మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, జూన్‌ 3 (‌ప్రజాతంత్ర బ్యూరో): స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మానవత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎంతోమంది అనాధ బిడ్డలకు అండగా నిలుస్తున్నాడు. కుటుంబాలకు అన్నగా, పెద్ద దిక్కుగా నిలుస్తున్నాడు. హరీష్‌రావు అంటే సందేశం పంపితే(వాట్సాప్‌ ‌ద్వారా కూడా) తక్షణమే స్పందించే నాయకుడయ్యాడు. ప్రజా సమస్యలపై పరిష్కారం చేసే ప్రజా సేవకుడు. ఆపద వచ్చిందంటే నేను ఉన్నా అని ధైర్యం చెప్పే ఆపద్బాంధవుడు. కష్టం ఉంది అంటే చాలు మంచి మనసు ఉండే మానవత్వం ఆయనకే స్వంతం. ఇలా చెప్పుకుంటూ పోతే మాటలు.. పదాలు సరిపోవు అలాంటి నాయకుడు మరోసారి తన పుట్టినరోజు సందర్భంగా మానవత్వాన్ని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళ్లితే…తన్నీరు పేరులోనే ఉంది కన్నీరు తుడిచి గొప్ప మనసు.

తల్లిదండ్రులు లేని భాగ్య అనే అనాధ బాలికకు అన్నీ తానై అండగా నిలిచాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు లేరు అనే విషయం తెలుసుకున్న ఆయన సిద్దిపేట బాలసదనంలో ఉంచి చదివించాడు. పెద్ద చేశాడు. తర్వాత పెళ్లీడుకు వస్తే వస్తే గత సంవత్సరం భాగ్యకు పెండ్లి చేపించి బరువు దించాడు. తల్లిదండ్రులు లేని అనాధను చదివించి.. పెద్ద చేసి..పెండ్లి చేసిన మంత్రి హరీష్‌రావు గురువారం(జూన్‌, 3)‌తన పుట్టిన రోజు సందర్భంగా భాగ్యకు ఆశ్రయం ఇచ్చాడు. సిద్దిపేట కేసీఆర్‌ ‌నగర్‌లోని డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇల్లు ఇప్పించి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా భాగ్య దంపతులకు డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇంటి పట్టా, తాళం చెవి అందజేశారు. నాడు నేను ఉన్నా అని భాగ్యకు ఇచ్చిన భరోసాకు నేడు బాధ్యతగా అన్నివిధాలా అండగా ఉన్నాడు మంత్రి హరీష్‌రావు.

ఇక మరో విషయానికి వస్తే…రెక్కాడితే గానీ డొక్కాడని…రోజంతా తిరుగితే పూట గడవని కుటుంబాలు ఆటో కార్మికులవి. రోజు వారీ మిత్తిలకు తెచ్చుకుని కుటుంబ పోషణ చేసే ఆటో కార్మికుల వ్యధ అంతా ఇందా కాదు. అలాంటి ఆటో కార్మికుల కుటుంబాలకు అన్నాలా నేనున్నా. అండగా ఉంటా అని తన ఇల్లు తాకట్టు పెట్టి ఆటో కో ఆపరేట్‌ ‌సొసైటీ ఏర్పాటు చేసి బ్యాంక్‌ ‌లోన్‌ ‌తీసుకుని.. మానవతా దృక్పథంతో కార్మికులకు ఆర్థిక భరోసానిచ్చారు మంత్రి హరీష్‌రావు. కార్మికులు అప్పులు చేయొద్దు.. ఆత్మవిశ్వాసంతో బతకాలి.. సిద్ధిపేట బ్రాండ్‌ అం‌బాసిడర్లు ఎవరు అంటే ఆటో డ్రైవర్లు అని గర్వంగా చెప్పుకోవాలి అని మంత్రి హరీష్‌రావు ఈ సొసైటీని ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో ఇటీవల దురదృష్టవశాత్తు అనారోగ్యంతో సిద్దిపేట పట్టణానికి చెందిన పిడిశెట్టి దుర్గయ్య మరణించగా ఆయన కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వాలి, అండగా నిలవాలి అని 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ‌చెక్కును ఆయన కుటుంబానికి అందజేశారు. కో ఆపరేట్‌ ‌సొసైటీ ఏర్పాటు చేశాక తొలి బీమా చెక్కును తన పుట్టిన రోజు ఆ కుటుంబానికి ఇస్తే సొసైటీ ఏర్పాటుకు సార్దకత ఉంటుందని మంత్రి హరీష్‌రావు అనుకుని ఆ కుటుంబానికి బాసటగా నిలిచి దాతృత్వాన్ని చూపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. తన పుట్టిన రోజున ఆ రెండు కుటుంబాల్లో ఒక ఆత్మవిశ్వాసం.. ఆర్థిక భరోసా..మానసిక ధైర్యం ఇచ్చిన గొప్ప సంతృప్తినిచ్చిందనీ ఈ సందర్భంగా అన్నారు.

Leave a Reply