Take a fresh look at your lifestyle.

బిజెపి సర్కార్‌.. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేస్తున్నది

  • ఆరేండ్లలో 12 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ భర్తీచేశారు?
  • ఎంఎల్‌సి ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్‌ ‌రావు

‌బీజేపీ నాయకులకు దమ్ముంటే రాష్ట్రానికి ఐటీఐఆర్‌, ‌కాజీపేట కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వడం లేదని కేంద్రాన్ని నిలదీయాలని మంత్రి హరీష్‌ ‌రావు సూచించారు. సోమవారం కూకట్‌పల్లిలో నిర్వహించిన హైదరాబాద్‌-‌రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ‌పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ‌ప్రైవేటుపరం చేస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు.

గడిచిన ఆరేండ్లలో ప్రభుత్వం కూకట్‌పల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిందన్నారు. అండర్‌ ‌బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్లు నిర్మించామని, రూ.200 కోట్లతో తాగునీటి సమస్య తీర్చామని గుర్తుచేశారు. నిరంతర విద్యుత్‌ ‌సరఫరాతో మూడు షిప్టుల్లో పరిశ్రమలు నడుస్తున్నాయని, పక్కనే ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరెంటు కోతలు, తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారు.

అవాకులు, చవాకులు పేలే బీజేపీ నాయకులు దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామి ఇచ్చారు. ఈ లెక్కన ఆరేండ్లలో 12 కోట్ల ఉద్యోగాలు భర్తీచేయాలి..ఎక్కడ చేశారని నిలదీశారు. కార్యకర్తలకు టీఆర్‌ఎస్‌ ‌నిరంతరం అండగా ఉంటుందని అన్నారు.

Leave a Reply