Take a fresh look at your lifestyle.

నేనున్నాననీ…

  • ప్రైవేట్‌ ‌టీచర్లకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన మంత్రి హరీష్‌ ‌రావు
  • తోర్నాలలో ఎస్సీ రైతులకు వ్యవసాయ పనిముట్లు అందజేత

కొరోనా మహమ్మారితో అతలాకుతలమైన ప్రయివేట్‌ ‌టీచర్లకు అండగా నేనున్నానంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు ముందుకొచ్చారు. ఈ మేరకు సిద్ధిపేటలోని కొండా భూదేవి గార్డెన్స్‌లో మంగళవారం మంత్రి హరీష్‌ ‌రావు సహకారంతో 900 మంది ప్రయివేట్‌ ‌టీచర్లకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ..దురదృష్టవశాత్తు కొరోనాతో ప్రయివేట్‌ ‌టీచర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గమనించి, ఇతోధికంగా సాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు.కొరోనాతో చిరు వ్యాపారులు, చిన్న ఉద్యోగులకు ఎఫెక్ట్ అయ్యిందని, సుమారు 10 నెలల పాటు ఎంతో ఇబ్బందులు పడ్డారని, ఆటో డ్రైవర్లు, హామాలి, రిక్షా, మార్కెట్‌ ‌వర్కర్లు, నాయి బ్రాహ్మణులు, మున్సిపల్‌ ‌సఫాయి కార్మికులు.. ఇలా ఇప్పటివరకు దాదాపు 10 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశామని మంత్రి చెప్పారు. ఇంతకు మునుపు వెయ్యి మంది టీచర్లకు సాయం అందించినట్లు, ఇవాళ 900 మందికి హెల్త్ ‌కిట్స్, ‌గ్రాసారీ కిట్స్ అం‌దిస్తున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే 50వేల పైచిలుకు ఉద్యోగాలకు సీఎం కేసీఆర్‌ ఉద్యోగ నోటిఫికేషన్‌ ‌విడుదల చేయాలని నిర్ణయించారని, ఈ విషయమై సిద్ధిపేట నిరుద్యోగ యువతీ, యువకులకు సాయం అందించేందుకు శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్స్ ఇప్పిస్తానని మంత్రి భరోసా ఇచ్చారు.

సిద్ధిపేటను అన్నీ రకాలుగా అభివృద్ధి చేసిన విషయాలను వెల్లడించి బెంచ్‌ ‌మార్కుగా నిలిపినట్లు మంత్రి హరీష్‌ ‌రావు చెప్పుకొచ్చారు. ఈ మేరకు సిద్దిపేటను శుద్ధిపేటగా మార్చుకుందామని, పట్టణ ప్రజలు ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛత యాప్‌ ‌లో గ్రీవెన్స్ ‌లో వెళ్లి మీ ఫిర్యాదులు ఇవ్వాలని, పట్టణానికి చెందిన ప్రతి పౌరుడు దేశ వ్యాప్తంగా భారత ప్రభుత్వం మున్సిపాలిటీ పట్టణాల్లో నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌ ఓటింగ్‌ ‌లో పాల్గొని సిద్ధిపేట పట్టణ పేరును ఇనుమడింప చేయాలని కోరారు.
నలుగురికీ ఆదర్శంగా నిలుద్దాం..తోర్నాలలో ఎస్సీ రైతులకు వ్యవసాయ పనిముట్లు అందజేత
డంప్‌ ‌యార్డు అంటే ముక్కు మూసుకుని పోయే పరిస్థితి., కానీ సిద్ధిపేటలోని మానవ వ్యర్థాల కేంద్రం ప్రారంభించిన తర్వాత సిద్ధిపేట ఒక బెంచ్‌ ‌మార్కుగా చెప్పుకొచ్చి.. సిద్ధిపేట అంటే ఒక ప్రయోగశాలగా చెప్పారు. తోర్నాలలోని పాలిటెక్నీక్‌ ‌కళాశాలలో మంగళవారం ఉదయం వ్యవసాయ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో ఎస్సీ సబ్‌ ‌ప్లాన్‌ ‌పథకం కింద ఎస్సీ రైతులకు వ్యవసాయ పనిముట్లు మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక రైతు జీవితంలో మార్పు వచ్చిందని, తెలంగాణ రాక ముందు రైతు పరిస్థితి సమస్యల సుడిగుండం వలయంలో ఉండేదని, తెలంగాణ వచ్చాక పరిస్థితి మారిందని పలు ఉదాహరణలుగా వివరించారు. రైతుకు ఆదాయం ఎక్కువగా రావాలన్నదే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రైతుల జీవన విధానంలో మార్పు రావాలని, ఈ రీసెర్చ్ ‌సెంటరు ఎవాల్యూయేషన్‌ ‌రిపోర్టు కావాలని, సిద్ధిపేటలో వ్యవసాయ పాలిటెక్నిక్‌ ‌కళాశాల, పరిశోధన సంస్థ ఉండటంతో రైతులకు మేలు జరగాలనే కోరుతున్నట్లు.. ఆ దిశగా మార్పు తేవాలని ఆయా పరిశోధన సంస్థ, పాలిటెక్నిక్‌ ‌కళాశాల అధ్యాపక బృందాలు కృషి చేయాలని సూచించారు. వచ్చే సంవత్సరం లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు పోదామని, రేపు బుధవారం ఉదయమే మీ వద్దకు వస్తానని అన్నీ కూలంకుషంగా చర్చించుకుందామని మంత్రి చెప్పారు.

Leave a Reply