Take a fresh look at your lifestyle.

చేసింది చెపుదాం…చెప్పేదే చేద్దాం

అభివృద్ధి, సంక్షేమ రంగంలో దేశానికి తెలంగాణ రోల్‌ ‌మోడల్‌ అని, మనం చేసింది చెప్పి..చెప్పేదే చేద్దామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ఎదుటి పార్టీల గోబెల్స్ ‌ప్రచారాలను తిప్పికొట్టడంలో ముందుండి పని చేయాలని దుబ్బాక సోషల్‌ ‌మీడియా ఇంఛార్జిలకు మంత్రి హరీష్‌ ‌రావు దిశానిర్దేశం చేశారు. మంగళవారం సిద్దిపేటలో సోషల్‌ ‌మీడియా ఇంఛార్జిలతో మంత్రి హరీష్‌ ‌రావు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. ప్రజల్లో అసత్య ప్రచారాలు చేస్తూ…జరగనిదాన్ని జరిగినట్టు చేస్తూ అవాస్త్తవాలు, గోబెల్స్ ‌ప్రచారాలను బిజెపి, కాంగ్రెస్‌ ‌పార్టీల నేతలు సృష్టిస్తున్నారనీ, అలాంటి అసత్యాలను సోషల్‌ ‌మీడియా ఇంఛార్జిలు తిప్పి కొట్టాలని సూచించారు. రెండురోజులుగా బిజెపి శ్రేణులు  సోషల్‌ ‌మీడియాలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వం బీడీ కార్మికులకు ఇస్తున్న 2వేల రూపాయల పింఛన్‌లో కేంద్రంలోని బిజెపి పార్టీ ప్రభుత్వం 1600 రూపాయలు ఇస్తున్నట్లు, మిగతా 400 రూపాయలు మాత్రమే రాష్ట్రంలోని కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఇస్తున్నట్లు  ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తూ తిరుగుతున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో బీడీ కార్మికులకు 1600రూపాయల పింఛన్‌ ఎం‌దుకు ఇవ్వడం లేదన్నారు. అసలు బీడీ కార్మికులకు పింఛన్‌ను దేశంలో తెలంగాణ రాష్ట్రం తప్ప  ఏ రాష్ట్రంలోనైనా ఇస్తున్నారా?అని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో  వృద్ధులకు కేవలం 500 రూపాయల పింఛన్‌ ‌మాత్రమే ఇస్తున్నారన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply