సిద్ధిపేట, నవంబర్ 22 (ప్రజాతంత్ర బ్యూరో): జిల్లా కేంద్రమైన సిద్ధిపేటకు చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు బత్తుల శ్రీనివాస్, బత్తుల చంద్రం తండ్రి బత్తుల నారాయణ చనిపోయారు. సమాచారం తెలుసుకున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆదివారం సిద్ధిపేటలోని బత్తుల బ్రదర్స్ నివాసానికి వెళ్లి నారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బత్తుల బ్రదర్స్‌ను పరామర్శించారు. బత్తుల బ్రదర్స్‌ను అధైర్యపడొద్దూ…నేనున్నాంటూ భరోసా ఇచ్చారు. మంత్రితో పాటు మునిసిపల్ ఛైర్మన్ కడవేర్గు రాజనర్సు, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డితో పాటు స్థానిక టిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.