Take a fresh look at your lifestyle.

రెండున్నరేళ్లలో తెలంగాణలో దళితుల అభివృద్ధికి లక్ష కోట్లు ఖర్చు

  • వచ్చే సంవత్సరం దళితబంధు కింద బడ్జెట్‌లో రూ.30 వేల కోట్లు కేటాయించాలి
  • ఆర్థిక శాఖను ఆదేశించిన మంత్రి హరీష్‌రావు
  • చేర్యాలలో మంత్రి హరీష్‌రావు బిజీ బిజీ..

సిద్ధిపేట, ఆగస్టు 9 (ప్రజాతంత్ర బ్యూరో): రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట జిల్లా చేర్యాలలో సోమవారం పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. జనగామ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చేర్యాల మునిసిపాలిటీ, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి , ధూళిమిట్ట మండలాలలోని అభివృద్ధి పనుల పురోగతిపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ… చేర్యాలలో ట్యాంక్‌బండ్‌ ‌సుందరీకరణ పెండింగ్‌ ‌పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ఇండ్లలోకి వర్షపు రాకుండా ఇరిగేషన్‌ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రెండు రోజుల్లో చేర్యాల కేంద్రంగా  ఆర్‌డబ్ల్యూఎస్‌ ఉప కార్యనిర్వాహక ఇంజనీరు కార్యాలయంకు ప్రారంభోత్సవం చేయాలని ఆదేశించారు.

చేర్యాలలలో 17 కోట్ల రూపాయలతో నిర్మాణంలో ఉన్న సమీకృత కార్యాలయాల సముదాయం భవనం నిర్మాణం (ఐవోసి) ను డిసెంబర్‌లోగా పూర్తి చేయాలన్నారు. ఐవోసి గ్రౌండ్‌ ‌ఫ్లోర్‌ ‌మొత్తం పురపాలక సంఘం కార్యాలయంకు కేటాయించా లన్నారు.  ప్రస్తుత మునిసిపాలిటీ కార్యాలయం, మార్కెట్‌ ఉన్న స్థలంలో రూ.3 కోట్ల 60 లక్షల రూపాయలతో వెజ్‌, ‌నాన్‌ ‌వెజ్‌ ‌మార్కెట్‌ను నిర్మిస్తామన్నారు. అవసరమైతే అదనంగా రూ.కోటి రూపాయలను వెజ్‌, ‌నాన్‌ ‌వెజ్‌ ‌మార్కెట్‌ ‌నిర్మాణం కోసం వెచ్చిస్తామన్నారు. చేర్యాలలో ఇరిగేషన్‌ ‌సబ్‌ ‌డివిజన్‌ ఆఫీస్‌ను యధావిధిగా తీసుకు వస్తామన్నారు. చేర్యాల లోని సర్వే నెం.110లో 7 ఎకరాలు కుంటగా రెవెన్యూ రికార్డ్ ‌లలో తప్పుగా నమోదైన స్థలాన్ని సవరించి వారం రోజుల్లో మునిసిపాలిటీకి ప్లే గ్రౌండ్‌ అభివృద్ధి కోసం ఆ స్థలాన్ని కేటాయించా లన్నారు.  చేర్యాలలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ ‌డైరెక్టర్‌ ‌కార్యాలయంను ఏర్పాటు చేస్తామన్నారు.  బచ్చన్న పేట, చేర్యాల, దుద్దెడ వరకు గల రోడ్డు ప్యాచ్‌ ‌వర్క్ ‌పనులు వెంటనే పూర్తి చేస్తామన్నారు. రూ. 450 కోట్లతో శాశ్వతంగా చేపట్టనున్న బచ్చన్నపేట, చేర్యాల , దుద్దెడ క్రాస్‌ ‌రోడ్‌ అభివృద్ధి పనులకు 50 రోజుల్లో అనుమతులిస్తామన్నారు. చేర్యాల మునిసిపాలిటీ లో సిసి రోడ్ల నిర్మాణంకు రూ. కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.   డా.బిఆర్‌ అం‌బేద్కర్‌ ‌కమ్యూనీటి భవనంకు మరో 75 లక్షలు మంజూరు చేస్తామనీ,  కోటి 25 లక్షలతో అన్ని హంగులతో చేర్యాలలో డా.బిఆర్‌ అం‌బేద్కర్‌ ‌కమ్యూనీటి భవనం నిర్మిస్తామన్నారు.

అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందనీ, రెండున్నరేళ్లలో తెలంగాణలో దళితుల అభివృద్ధికి లక్ష కోట్లు ఖర్చు చేస్తామన్నారు. వచ్చే సంవత్సరం దళితబంధు కింద బడ్జెట్‌ ‌లో రూ.30 వేల కోట్లు కేటాయించాలని ఆర్ధిక శాఖను ఆదేశించారు. దళితబంధుతో తమ కాళ్లమీద తాము నిలబడేలా నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతుబంధు మాదిరే దళితబంధు దేశానికి ఆదర్శంగా స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. దళిత జాతికి సరికొత్త దశా దిశా చూపే కార్యక్రమం దళితబంధు అని, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. చెప్పిన అన్ని కార్యక్రమాలు సిఎం కేసిఆర్‌ అమలు చేసి చూపారనీ, అదే స్ఫూర్తితో దళితబంధు అమలు చేసి తీరుతామన్నారు.  త్వరలో సొంత జాగాలో డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్లు నిర్మించు కునే వారికి ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. చేర్యాల పెద్దమ్మ గడ్డ బాలుర జడ్‌పిహెచ్‌ఎస్‌లో రూ. కోటి రూపాయలతో నిర్మించిన అదనపు తరగతులకు మంత్రి హరీష్‌రావు ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌వేలేటి రోజారాధాకృష్ణశర్మ, డిసిసిబి ఛైర్మన్‌ ‌చిట్టి దేవేందర్‌రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, టిఆర్‌ఎస్‌ ‌నేతలు, వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply