రంగనాయకసాగర్ వద్ద కేక్ కట్ చేసిన జడ్పి ఛైర్పర్సన్..
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు 48వ వసంతంలోకి అడుగుపెట్టారు. 48వ పుట్టిన రోజును మంత్రి హరీష్‌రావు అభిమానులు, సన్నిహతులు, శ్రేయోభిలాషులు, పార్టీ శ్రేణులు ఒక పండుగలా జరుపుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి హరీష్‌రావు బర్త్‌డే వేడుకలు చాలా గ్రాండ్‌గా జరిగాయి. హరీష్ బర్త్‌డే సందర్బంగా ఆయన స్పూర్తితో పలువురు మొక్కలను నాటారు. దేవాయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంత్రి హరీష్‌రావు బర్త్ డే సందర్భంగా సిద్ధిపేట సమీపంలోని శ్రీ రంగనాయకసాగర్ రిజర్వార్ వద్ద టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, శ్రేణులు కేక్ చేశారు. చంద్లాపూర్ సర్పంచి సూరగోని చంద్రకళ రవిగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కేక్ కటింగ్‌లో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ రోజారాణి శర్మ ముఖ్య అతిథిగా హాజరై కేక్‌ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నేతలు రాధాక్రిష్ణశర్మ, కూర మాణిక్యరెడ్డి, కీసరి పాపయ్య, కాముని శ్రీనివాస్, బొడిగె సదానందంగౌడ్, ములకల కనకరాజు, సూరగోని రవిగౌడ్, ముక్కిస సత్యనారాయణరెడ్డి, అబ్బిరెడ్డి, కొండం రవీందర్‌రెడ్డి, భూంరెడ్డి, ముసర్ల మధుసూదన్‌రెడ్డి, ఉమేష్‌చంద్ర, ఇట్టబోయిన శ్రీనివాస్‌తో పాటు సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.