Take a fresh look at your lifestyle.

వోటుతో బిజెపికి మీటరు పెట్టాలె…

  • మా పట్ల మీ ప్రేమ, ఆదరణతో కాంగ్రెస్‌, ‌బిజెపి నేతల గుండెల్లో గుబులు
  • ఎల్కల్‌, ‌బేగంపేట ఎన్నికల ప్రచార సభలో మంత్రి హరీష్‌రావు

టిఆర్‌ఎస్‌ ‌పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణ, ప్రేమతో కాంగ్రెస్‌, ‌బిజెపి నేతల గుండెల్లో గుబులు పుట్టిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శనివారం సిద్ధిపేట జిల్లా బేగంపేట, ఎల్కల్‌లో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత-రామలింగారెడ్డికి మద్దతుగా మంత్రి హరీష్‌రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మీరు మాపై చూపిస్తున్న ప్రేమకు  చాలా సంతోషంగా ఉంది.  మేము కూడా గ్రామాన్ని అదేవిధంగా అభివృద్ధి చేస్తాం’ అన్నారు.

రామలింగారెడి మన మధ్య లేకపోవడం దూరదృష్టకరం, బాధాకరమన్నారు. అయితే,  ప్రజలు తమ పార్టీ ప•ట్ల చూపిస్తున్న ప్రేమకు చాలా సంతోషంగా ఉందనీ, వారి ప్రేమను తామెన్నడూ మరువమన్నారు. రైతుల సంక్షేమం కోసం టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వం కృషి చేస్తుంటే..కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ ప్రభుత్వ పెద్దలు మాత్రం రైతుల బాయిల దగ్గర మీటరు పెడతాడట. మరి మనం కూడా వోటుతో బిజెపికి మీటరు పెట్టాలన్నారు. మిషన్‌ ‌భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీళ్లు ఇచ్చి మహిళల కష్టాలు తీర్చామనీ, మహిళలకు మంచి నీళ్ల కష్టాలు పోగొట్టినట్లుగానే రానున్న రోజుల్లో ప్రతి ఎకరాకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లొస్తాయన్నారు.

Leave a Reply