Take a fresh look at your lifestyle.

వలస కార్మికులకు మంత్రి హరీష్ రావు భరోసా..

మనోహరాబాద్ సరిహద్దు ప్రాంతంలో…తమ స్వ రాష్ట్రాల కు రోడ్డు పై పిల్లలతో నడుచుకుంటూ వెళుతున్న వలస కార్మికులను చూసిన మంత్రి హరీష్ రావు కారు ఆపి వారి వివరాలు తెలుసుకున్నారు.హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఐదారు రోజుల నుంచి కాలినడకన ప్రయాణం చేస్తున్నామని, పని, ఆహారం‌లేదని ..ఈ‌కారణంతో తమ స్వంత రాష్ట్రాలకు బయలుదేరినట్లు‌  వలస‌ కార్మికులు మంత్రి కి తెలిపారు.
Minister Harish Rao assures migrant workersవారి మాటలకు‌ చలించిపోయిన మంత్రి హరీష్ రావు లాక్‌‌డౌన్ నేపధ్యంలో‌ఎక్కడికి వెళ్లవద్దని…మనోహరాబాద్ లోనే ఆశ్రయం కల్పిస్తానని తెలిపారు.ఎట్టి పరిస్థితుల్లోనూ స్వరాష్ట్రాలకు వెళతామన్న కార్మికుల తో పిల్లలతో కాలి‌నడకన వెళ్లడం‌శ్రేయస్కరం కాదని…ఇక్కడే ఉండాలని మంత్రి వారికి నచ్చచెప్పారు.స్థానికంగా ఉండేందుకు అన్ని రకాలుగా సాయం అందిస్తానని వారికి హామీ ఇవ్వడంతో‌ ఆనందం‌వ్యక్తం చేసారు వలస కార్మికులు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!