Take a fresh look at your lifestyle.

అటు బౌలింగ్‌…ఇటు బ్యాటింగ్‌..దుమ్మురేపిన హరీష్‌రావు

సిద్ధిపేటలో డే అండ్‌ ‌నైట్‌ ‌మ్యాచ్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు

నిత్యం ఏదో ఒక బిజీతో గడిపే మంత్రి హరీష్‌రావు ఆదివారం కావడం సిద్దిపేటలోని పర్యటనలు, కార్యక్రమాలు ముగించుకుని సిద్దిపేట మినీ ట్యాంక్‌ ‌బండ్‌పై కాసేపు కలియ తిరిగారు. బండ్‌ ‌పై వచ్చిన పర్యాటకులతో కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. సిద్ధిపేట స్టేడియంలో మెదక్‌ ‌పోలీసు వర్సెస్‌ ‌సిద్ధిపేట పోలీస్‌ ‌డే అండ్‌ ‌నైట్‌ ‌క్రికెట్‌ ‌మ్యాచ్‌ను ప్రారంభించారు.

సిద్ధిపేట మినీ స్టేడియంలో మెదక్‌ ఎస్పీ పోలీస్‌ ‌వర్సెస్‌ ‌సిద్ధిపేట పోలీసు కమిషనరేట్‌ ‌మధ్య 20 ఓవర్ల క్రికెట్‌ ‌మ్యాచ్‌ ‌జరిగింది. ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు హాజరై టాస్‌ ‌వేసిన అనంతరం కాసేపు క్రికెట్‌ ఆటలో భాగంగా ఒక ఓవర్‌ ‌బ్యాటింగ్‌ ‌చేసి, మరో ఓవర్‌ ‌బౌలింగ్‌ ‌చేశారు. ఈ మేరకు సిద్ధిపేట పోలీసు కమిషనర్‌ ‌జోయల్‌ ‌డేవిస్‌ ‌బౌలింగ్‌ ‌చేయగా మంత్రి హరీష్‌రావు బ్యాటింగ్‌ ‌చేసి వినూత్న షాట్లు కొడుతూ తన బ్యాటింగ్‌ ‌శైలిని కనబర్చారు. ఆ తర్వాత మంత్రి బౌలింగ్‌ ‌చేయగా పో

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply