Take a fresh look at your lifestyle.

సమావేశ మందిరాలు.. అర్థవంతమైన చర్చలకు వేదికలుగా మారాలి

  • ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
  • రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు

సమావేశ మందిరాలు అర్థవంతమైన చర్చలకు వేదికలుగా మారాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు.బుధవారం సంగారెడ్డి లో జెడ్‌ ‌పి నూతన భవనానికి మంత్రి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం జడ్పీ చైర్‌ ‌పర్సన్‌ ‌మంజు శ్రీ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్‌ ‌సాధారణ సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ జెడ్‌ ‌పి టి సి లు , ఎంపీపీలు సమావేశాలకు విధిగా హాజరు కావాలన్నారు. సమావేశంలో జరిగిన విషయాలను అర్థం చేసుకుని దానిని మండల ప్రజలకుతెలియజేయాలన్నారు. సమావేశాలకు హాజరు అవడంతో విషయపరిజ్ఞానం పెరుగుతుందన్నారు. ప్రతినిధులు పదవికి వన్నె తెచ్చే విధంగా, ప్రజలకు జవాబుదారీగాఉండాలన్నారు. వృత్తి ధర్మాన్ని, అధికారాన్ని పూర్తిస్థాయిలో నిర్వహించు కోవాలని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కు సంబంధించి చర్చకు రాగా వ్యవసాయ శాఖ అధికారి నర్సింగరావు జిల్లాలో సాగవుతున్న విస్తీర్ణం ప్రస్తుతం ప్రాధాన్యత పంటల సాగు విధానంలో 42,500 ఎకరాలలో వరి, 75 వేల ఎకరాల్లో కంది , 3.62 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేయడానికి నిర్ణయించుకొన్నామని తెలిపారు. వర్షాకాలంలో మొక్కజొన్న సాగు చేయడం లేదన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, ‌జహీరాబాద్‌ ‌శాసన సభ్యులు మాణిక్యరావు లు మాట్లాడుతూ ఎక్కడ సోయాబీన్‌ ‌సాగుకు డిమాండ్‌ ఉం‌దో అక్కడ సోయాబీన్‌ ‌విత్తనాలు తేప్పించాలని కోరారు. వానాకాలం విత్తనం పడకముందే జిల్లాకు అవసరమైన ఎరువులను ముందుగానే తెప్పించాలని, ఎరువులకు ఎలాంటి సమస్య రాకుండా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు. గ్రామాలకే ఎరువుల లారీ తీసుకెళ్లాలని, ముందురోజే టాంటాం ద్వారా రైతులకు తెలియజేయాలని, ఎరువులు రెడీగా ఉన్నాయని, ముందుగా తీసుకెళ్లాలని రైతులకు చెప్పాలని ప్రజాప్రతినిధులకు మంత్రి చెప్పారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డీల ర్స్, ‌రైతు ఆగ్రో కేంద్రాల ద్వారా ఎరువులను అందిస్తున్నామని, అవసరమైతే ఐ కె పి స్వయం సహాయక సంఘాల ద్వారా ఎరువులు గ్రామాలకు సరఫరా చేయాలని మంత్రి సూచించారు.

ఫోన్‌ ‌చేస్తే 48 గంటల్లోగా సంబంధిత గ్రామానికి ఎరువుల లోడ్‌ ‌పంపిస్తామని డిసిఎంఎస్‌ ‌చైర్మన్‌ ‌శివకుమార్‌ ‌మంత్రికి తెలిపారు. రైతులు మండల కేంద్రంకు వెళ్లకుండా సకాలంలో వారి గ్రామాల్లోనే ఎరువులు అందిస్తే రైతులకు సహాయం చేసిన వారం అవుతామని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో ఎరువుల కొరత లేకుండా వచ్చే రెండు వారాల్లో పూర్తిస్థాయిలో ఎరువులను మండల కేంద్రాలకు, గ్రామాలకు చేర్చాలని దీనిపై డీసీఎంఎస్‌ ‌చైర్మన్‌ ,అదనపు కలెక్టర్‌ ‌వీరారెడ్డి ,వ్యవసాయ అధికారులు చొరవ చూపాలని మంత్రి సూచించారు. ఏరైతు కూడా ఈ సారి రైతుబంధు రాకుండా ఉండ రాదని మంత్రి తెలిపారు. కొత్తగా పాస్‌ ‌బుక్స్ ‌వచ్చిన వారందరి ఆధార్‌, ‌బ్యాంక్‌ అకౌంట్‌ ‌నెంబర్‌ ‌ను ఎన్రోల్‌ ‌చేయించాలని, ఏ ఈ ఓల వద్ద వెరిఫికేషన్‌ ‌పెండింగ్లో ఉన్నవి, పెండింగ్‌ ‌లో ఉన్న పాత పాస్‌ ‌పుస్తకాల వివరాలు సేకరించి ఈ నెల 13లోగా అందజేయాలని మంత్రి జిల్లా వ్యవసాయ అధికారికి ఆదేశించారు.రుణమాఫీ కి సంబంధించి తొందరగా వెరిఫికేషన్‌ ‌చేసి పంపాలని ఏ ఒక్క రైతు మిగలడానికి వీల్లేదని మంత్రి తెలిపారు. వచ్చే వారం నుండి లక్ష రూపాయల లోపు వారి వివరాలు అందించాలన్నారు. నాలుగు విడతలుగా వారి అకౌంట్‌ ‌లలో రుణమాఫీ డబ్బులు జమ అవుతుందన్నారు.

జిల్లాలో 116 క్లస్టర్లలో రైతు వేదికలు త్వరితగతిన నిర్మించడానికి చర్యలు చేపట్టాలని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సూచించారు. యాసంగి వరకు జిల్లాలో అన్ని రైతు వేదికల నిర్మాణాలు పూర్తి కావాలని, అందుకు ప్రజా ప్రతినిధులు ,జిల్లా కలెక్టర్‌ ‌దృష్టి సారించాలని మంత్రి కోరారు.ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రతి సంవత్సరం సుమారు 70 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు మంత్రి వివరించారు. జిల్లాలో పచ్చిరొట్ట సాగు పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఎరువుల వాడకం తగ్గించాలన్నారు. జిల్లాలో ఉపాధి హామీ లో చాలా బాగా పనులు జరిగాయని, రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో నిలిచి నందుకు మంత్రి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులను అభినందించారు. ఈజీఎస్‌ ‌లో గొర్రెలు ,బర్రెలు షెడ్లు నిర్మించుకోవడానికి, డ్రై ఇంగ్‌ ‌ప్లాట్ఫామ్స్ , ‌కోళ్ల షెడ్స్ ‌కట్టుకోవడానికి, కంపోస్టు పిట్‌ ‌నకు, కూరగాయల పందిరి సాగుకు అవకాశం ఉన్నందున రైతులను ప్రోత్సహించాలని సూచించారు. 100% డంప్‌ ‌యార్డులు పూర్తి కావాలని, పూర్తయిన వాటిని వినియోగంలోకి తీసుకువచ్చి కంపోస్టు తయారీ చేయాలని మంత్రి ప్రజాప్రతినిధులకు సూచించారు. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రతి గ్రామంలో కనీసం అర ఎకరం స్థలాన్ని గుర్తించాలని కోరారు.

అన్ని చెరువుల్లో, పంట కాలువల్లో యుద్ధ ప్రాతిపదికన పూడికతీత పనులు చేపట్టాలని, హరితహారానికి గ్రామం వారిగా లక్ష్యాలను నిర్దేశించి గుంతలు తీఇంచాలని సూచించారు.ఈజీఎస్‌ ‌లో మంజూరు ఇచ్చిన 120 గ్రామ పంచాయతీ భవనాలు పూర్తి చేయాలని, ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు కట్టుకునే విధంగా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు.అందోల్‌ ‌శాసనసభ్యులు క్రాంతి కిరణ్‌ ‌మాట్లాడుతూ ఈజీఎస్‌ ‌పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే బాగుంటుందని ప్రభుత్వం ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని మంత్రిని కోరారు. ఎమ్మెల్సీ ఫరీరుద్దీన్‌ ‌మాట్లాడుతూ జిల్లా ప్రజా పరిషత్‌ ‌సమావేశంలో జరిగే చర్చలు ఫలప్రదంగా జరగాలన్నారు. నర్సాపూర్‌ ‌శాసనసభ్యులు మదన్‌ ‌రెడ్డి మాట్లాడుతూ అర్థవంతమైన చర్చలు జరిపి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలన్నారు. జహీరాబాద్‌ ‌శాసనసభ్యులు మాణిక్‌ ‌రావు మాట్లాడుతూ మన రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో ఉండేలా అందరూ కృషి చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్‌ ‌హనుమంతరావు మాట్లాడుతూ ప్రజోపకరమైన చర్చలు, పనులు జరగాలని ఆశించారు. జడ్పీ నూతన భవన ప్రారంభోత్సవానికి ముందు పాత జడ్పీ భవనంలోకి మారిన ఆర్డీవో కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు.ఈ సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి , నారాయణఖేడ్‌ ‌శాసనసభ్యులు భూపాల్‌ ‌రెడ్డి, అదనపు కలెక్టర్లు రాజార్షి షా , వీరారెడ్డి, డీ సి సి బి చైర్మన్‌ ‌చిట్టి దేవేందర్‌ ‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ‌నరహరి రెడ్డి, డీసీఎంఎస్‌ ‌చైర్మన్‌ ‌శివ కుమార్‌, ‌జడ్పీ వైస్‌ ‌చైర్మన్‌ ‌ప్రభాకర్‌, ‌జెడ్‌ ‌పి టి సి లు,ఎంపీపీ లు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply