అటు కొరోనాపై పోరాటం…ఇటు కర్షకుడి సంక్షేమానికి కృషి
దళారీ లేకుండా ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుంది
శనగలకు క్వింటాలుకు రూ. 4875 మద్దతు ధర
రాష్ట్ర వ్యాప్తంగా 7770 వరి కొనుగోళ్ల కేంద్రాలను ప్రారంభిస్తున్నాం
శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్‌రావు
ఓ వైపు కొరోనా మహమ్మారిపై పోరాటం చేస్తూనే…మరోవైపు రైతుల సంక్షేమం కొరకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శ్రమిస్తున్నారనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు. సోమవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం దాచారంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ… 24 గంట) పాటు ఓ వైపు కరోనాతో పోరాడుతున్నాం. ఇంకో వైపు రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రైతు పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో శ్రద్ధతో పని చేస్తున్నదనీ, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా రైతు శ్రేయస్సు కోసమే తెలంగాణ ప్రభుత్వం ఈ రకమైన ఏర్పాట్లు చేపట్టిందన్నారు. గన్నీ బ్యాగులు సరిపోవడం లేదనీ, సంచులు లభించడం లేదని స్వయంగా ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి మోదీతో మాట్లాడారన్నారు. దేశంలోని పశ్చిమ బెంగాల్లో మాత్రమే తయారయ్యే గన్నీ బ్యాగుల కోసం దేశ వ్యాప్త లాక్డౌన్ తో ఆ రాష్ట్రంలోని పరిశ్రమలు మూత పడ్డా.. పరిశ్రమలు తెరిపించి సంచులు తయారు చేయించి బెంగాల్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి సంచులు పంపాలని ప్రధానమంత్రిని సిఎం కేసీఆర్ కోరారన్నారు. రైతులకు సంబంధించిన ప్రతి అంశాన్ని సీఏం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమం కోసం ప్రతి నిమిషం ఆలోచిస్తుంటారన్నారు. దళారులు లేకుండా రైతు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోళ్లు చేస్తుందనీ, శనగలను కింటాలుకు 4875రూపాయల మద్ధతు ధరతో కొనుగోలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7770 వరి కొనుగోళ్ల కేంద్రాలను ప్రారంభిస్తున్నామన్నారు. – త్వరలోనే మొక్కజొన్న, వరి, పొద్దు తిరుగుడు కొనుగోళ్ల కేంద్రాలను ప్రతి మండలాల్లో ప్రారంభిస్తాం.

ఇందు కోసం రూ. 30 వేల కోట్ల రూపాయల డబ్బు కొనుగోళ్ల కోసం ప్రభుత్వం కేటాయింపు చేసింద్నారు. కరోనా వైరస్ కట్టడికి కృషి చేస్తున్న డాక్టర్లకు, సఫాయి కార్మికులకు అందరికీ పేరు పేరునా నా కృతజ్ఞతలనీ, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పేదవాళ్ల కోసం ఉపాధి హామీ పనులను గ్రామ పంచాయితీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రారంబించాలన్నారు. కరోనా వైరస్ అంటే సిగ్గు పడాల్సిన రోగం కాదు, మీకు దగ్గు, జ్వరం, గొంతు నొప్పి ఉంటే మమ్మల్ని, ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించాలన్నారు. రైతులు కూరగాయలు విక్రయించేందుకు మార్కెట్ కు వెళ్లేందుకు పోలీసులు ప్రత్యేక పాసులు జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చామనీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.