సిద్ధిపేట కేంద్రంగా పనుచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇప్పించాలని, కార్పొరేట్ వైద్యశాలల్లో ఉచిత వైద్య సదుపాయం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం సిద్ధిపేటలో రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావుకు టియూడబ్ల్యూజె (ఐజెయూ) నేతలు వినతి పత్రం అందజేశారు.
ఈసందర్భంగా జిల్లా యూనియన్ అధ్యక్షుడు కె.రంగాచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె. రాజిరెడ్డి మాట్లాడుతూ..టియూడబ్ల్యూజె (ఐజెయూ)రాష్ట్రాకమిటీ పిలుపు మేరకు జిల్లా యూనియాన్ శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టియూడబ్ల్యూజె (ఐజెయూ) నాయకులు బబ్బురు రాజు, ఆకుల పాండు, మజ్జు, మైసారెడ్డి, వాజిద్ జర్నలిస్టులు పాల్గొన్నారు.