Take a fresh look at your lifestyle.

మంత్రి హరీష్ లంచ్ @డంప్ యార్డ్ ..!

  • దుర్గంధం మాటకు చెక్
  • మంత్రి ఆలోచనకు ప్రతిరూపం
  • ప్రజాప్రతినిధులతో డంప్ యార్డులో భోజనం చేసి వర్మీ కంపోస్టు తయారీపై అవగాహన కల్పించిన మంత్రి హరీశ్ రావు

చెత్త అంటేనే.. దుర్వాసన అంటూ ముక్కు మూసుకుని ఆమడ దూరం పోతాం. కానీ ఇందుకు భిన్నంగా మంత్రి హరీశ్ రావు ఏకంగా డంప్ యార్డులో ప్రజా ప్రతినిధులతో కలిసి లంచ్ చేశారు. డంప్ యార్డ్ అంటే చెత్త చెదారం ఉంటుందని., దుర్గంధంతో ఒక క్షణం కూడా నిలబడని చోట సహపంక్తి భోజనాలు చేసేలా మార్పు కోసం అన్నీ గ్రామాల్లో డంప్ యార్డులను వినియోగంలోకి తెచ్చి అందరికీ ఆదర్శప్రాయంగా నిలుద్దామని నంగునూరు మండల ప్రజాప్రతినిధులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మిడిల్ ట్రాన్స్ పోర్ట్ డంప్ యార్డు, పొడి వ్యర్థ వనరుల సేకరణ కేంద్రం, వార్డు స్థాయి సేంద్రీయ ఎరువుల తయారీ కేంద్రాలను సోమవారం మధ్యాహ్నం నంగునూరు మండల ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి హరీశ్ రావు సందర్శించారు.

ఈ సందర్భంగా ఒకరోజు పూర్తిగా డంప్ యార్డుకే సమయాన్ని కేటాయించి, రానున్న రోజుల్లో మీ గ్రామాల్లో కూడా డంప్ యార్డులో వర్మీ కంపోస్టు తయారు చేసే విధానం అమలు చేయాలని నంగునూరు మండల ప్రజా ప్రతినిధులకు మంత్రి సూచించారు. ఈ మేరకు పట్టణంలోని 4వ మున్సిపల్ వార్డులో సేకరించిన చెత్తను కంపోస్టుగా మారుస్తున్న తీరుతెన్నుల గురించి వార్డు కౌన్సిలర్ దీప్తి నాగరాజు సవివరంగా వివరించారు. డంప్ యార్డులో భోజనం చేసి యార్డు అర్థం మార్చేలా.. అన్నీ గ్రామాల్లో ఇదే తరహాలో స్వచ్చ సిద్దిపేటకు నాందిగా నిలువాలని సంకేతాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, నంగునూరు మండల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply