Take a fresh look at your lifestyle.

రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయండి

కేంద్రానికి మంత్రి హరీష్‌ ‌రావు మరోసారి లేఖ
ప్రజాతంత్ర. హైదరాబాద్‌ : ‌కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లను విడుదల చేయాలంటూ ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్‌ ‌రావు శనివారం మరోసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. గతంలో చేసిన అభ్యర్థనలను ఈ లేఖలో గుర్తు చేశారు. ఇవే అంశాలతో ఈ ఏడాది జనవరి 24న లేఖ రాసిన విషయం తెలిసిందే. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 94 ‌ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అబివృద్ధికి కేటాయించిన నిధులతో రెండేళ్ల బకాయి రూ.902 కోట్లు ఇంకా విడుదల చేయాల్సి ఉందని పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు రూ.817.61 కోట్లు ఇవ్వాలన్న 14వ ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం అకారణంగా తిసర్కరించిందనీ, రాష్ట్రం అన్ని షరతులను పూర్తి చేసినప్పటిక నిర్దిష్ట కారణం లేకుండా ఈ గ్రాంట్లను తిరస్కరించరనీ, కాబట్టి వీటిని వీలైనంత త్వరగా విడుదలయ్యేలా చూడాలని కోరారు. 2019-20తో పోల్చితే రాష్ట్రానికి పన్నులలో వాటా తగ్గుతుందనీ, ఈమేరకు తెలంగాణకు రూ.723 కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ ‌విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకాలలో రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరమైన 2014-15లో కేంద్రం వాటాను పొరపాటున తెలంగాణకు కాకుండా ఏపీకి విడుదల చేశారనీ, దీంతో తెలంగాణకు రావాల్సిన రూ.495 కోట్లను తిరిగి తెలంగాణకు కేటాయించాలని కోరారు. ఈ విషయాలన్నింటిపై గతంలోనే లేఖ రాశామనీ, అయినప్పటికీ స్పందన లేకపోవడంతో మరోసారి లేఖ రాస్తున్నట్లు ఈ సందర్బంగా మంత్రి హరీష్‌ ‌రావు కేంద్ర మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply