Take a fresh look at your lifestyle.

ముస్లీం సోదరులకు మంత్రి అండ

సూర్యాపేట, మే 23, ప్రజాతంత్ర ప్రతినిధి) : రంజాన్‌ ‌పర్వ దినోత్సావాన్ని  పురస్కరించుకొని జిల్లాలోని 5వేల ముస్లిం కుటుం బాలకు రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖ మం త్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి తోఫా రూపంలో పండుగ కానుకను ప్రక టించారు. తమ సొంత నిధులతో డ్రై ప్రూట్స్‌తో సహా పది రకాల నిత్యావసర సరుకులు ప్రతి ముస్లిం సొదరులకు శనివారం స్వయంగా అందజేశారు. లాక్‌డౌన్‌ ‌ప్రభావం తో పండుగను ఎలా జరుపుకోవా లని సందిగ్ధంలో ఉన్న పేద ముస్లిం ప్రజలకు మంత్రి అండగా నిలిచా రు. సూర్యాపేట మున్సిపాలిటీలోని చిన్న మసీదు వద్ద, రాయినిగూడెం వద్ద నిత్యావసర వస్తువులను అంద జేశారు. ధార్మిక చింతనల కలయి కతో ఏర్పడ్డ రంజాన్‌ ‌పర్వదినమున ఏ ఒక్క ముస్లిం సొదరుడు నిరాశకు లోను కావొద్దన్న సంకల్పంతో ఈ తోఫా కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభిం చారు. నిన్నటి దాకా రెడ్‌జోన్‌ ఏరియాగా ముద్రపడిన సూర్యాపేట పట్టణం లోని ముస్లిం సోదరులకు నిత్యావసర వస్తువులకు ఇబ్బంది కల్గకుండా అందజేయడం అభినందనీయమని కొనియాడారు. అంతేకాక స్వయంగా మంత్రే ప్రజలకు వద్దకు వచ్చి నిత్యావసర వస్తువులను అందజేయడంతో ముస్లిం సోదరులు పరవశించి పోతున్నారు.

తెలంగాణ గంగా, జమునా తహజీబ్‌ : ‌మంత్రి
అప్పటి ఆంగ్లేయుల పాలనలో సైతం హైదరాబాద్‌ ‌రాష్ట్రం సర్వమత సమ్మేళనానికి ఆదర్శంగా ఉండేదని రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ముస్లిం సోదరులకు నిత్యావసర వస్తువులను అందజేసి మాట్లాడారు. చంద్రామాన క్యాలెండర్‌ను అనుసరించే ఇస్లామీయ క్యాలెం డర్‌ ‌తొమ్మిదవ నెలలో రంజాన్‌ ‌మాసాన్ని పరవ పవిత్రమైన మా సం జరుపుకుంటారని అన్నారు. అందుకు ప్రధాన కారణం ఇదే మాసంలో దివ్య ఖురాన్‌ ‌గ్రంధం ఆవిర్భవించడమే అని పేర్కొన్నా రు. రంజాన్‌ ‌పర్వదినమున ఏ ఒక్క పేద ముస్లిం కూడా నిరాశ చెందకుం డా ఉండేందుకే తమ సొంత ఖర్చులతో ఆర్థిక సహా యం చే యడం జరిగిందన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వం ప్రకటించి న లాక్‌డౌన్‌తో ప్రజలు ఎటువం టి ఇబ్బందులు ఎదుర్కొ కుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తీసుకున్న నిర్ణయాల స్పూర్తితోటే రంజాన్‌ ‌పర్వదినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించా రు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌పెరుమాళ్ళ అన్నపూర్ణ, గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ ‌నిమ్మల శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌డిసిఎంఎస్‌ ‌చైర్మన్‌ ‌వట్టె జానయ్య యాదవ్‌, ‌జెడ్పిటిసి జీడి బిక్షం, ఎంపిపి రవీందర్‌ ‌రెడ్డి, జిల్లా టిఆర్‌ఎస్‌ ‌నాయకులు గండూరి ప్రకాష్‌, ‌కౌన్సిలర్లు  లవకుశ, అభినయ్‌, ‌రియాజ్‌  ‌పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy