సంచలన వ్యాఖ్య.. జర్నలిస్టుల ఉపవాస దీక్షకు మద్దతు..
తెలంగాణ యూనియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్టులు (ఐ జె యు ) ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేపట్టిన ఉపవాస దీక్షలో పాల్గొని ఎం పి రేవంత్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వచ్చే వారం ఈటెల ను మంత్రి పదవి నుండి తొలగిస్తున్నారు.. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పరిస్థితిని తీసుకువచ్చారు అని సంచలన ఆరోపణ చేశారు. విధిలేని పరిస్థితిలో జర్నలిస్టులు ముందుకు వస్తున్నారని. .మీరు ఉపవాస దీక్ష చేస్తున్నారు అంటే..రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది..అని స్పష్టమవుతుందని అన్నారు ప్రభుత్వం ఉదారంగా ముందుకు వచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉంది..కోవిద్ 19 సంక్షోభ పరిస్థితిలో 15 వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి పెరిగిందన్నారు .3.5 లక్షల రూపాయలు కరోనా పేషంట్స్ కి ఖర్చు పెడుతున్నా అని చెప్తున్న ప్రభుత్వం..మృతి చెందిన మనోజ్ కి ఎంత ఖర్చు పెట్టారో.. ప్రభుత్వం చెప్పాలి అన్నారు. తెలంగాణ లో ఇప్పటి వరకు 50 వేల టెస్టులు చేయలేదు.. దీంతో ఎంత నిర్లక్ష్యంగా ఉందో తెలుస్తోంది…అధికార పార్టీ ఎమ్మెల్యేకు కరోనా వస్తే.. యశోదా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు అని రేవంత్ రెడ్డి అన్నారు .ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి.. జర్నలిస్టుల సహాయ నిధికి 2లక్షల రూపాయలు చెక్ ను అందజేసారు .