Take a fresh look at your lifestyle.

కమలాపూర్ లో మంత్రి ఈటల సుడిగాలి పర్యటన

కమలాపూర్, మార్చి 9( ప్రజాతంత్ర విలేకరి)
కమలాపూర్ మండలం లో మంగళవారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సుడిగాలి పర్యటన చేశారు. కొల్లాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామానికి చెందిన ఇటీవల మృతి చెందిన కుమ్మరి సమ్మయ్య కుసుంభ రాజేశ్వరరావు కుటుంబాలను ఓదార్చి పరామర్శించారు. ఇటీవల నిర్మాణం పూర్తయిన మహంకాళి అమ్మవారి  విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గునిపర్తి గ్రామంలో ని శ్రీ అమృత లింగేశ్వర స్వామి  బ్రహ్మోత్సవాల్లో మంత్రి ఈటల పాల్గొన్నారు. ఈటల కు పూర్ణకుంభంతో ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాగా ఆలయ కమిటీ సభ్యులు మంత్రిని పూలమాలవేసి శాలువాలతో సన్మానం చేశారు. అనంతరం పల్ రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించి బ్రిడ్జి నిర్మాణాన్ని నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో మర్రిపల్లిగూడెం సర్పంచి ఇనుగాల కిరణ్మయి విజయ్ కుమార్, టిఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఫోటో రైటప్: ఉప్పల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలిస్తున్న మంత్రి ఈటెల రాజేందర్.

Leave a Reply